Monday, November 18, 2024

జాతీయ పార్టీపై త్వరలో కీలక ప్రకటన

- Advertisement -
- Advertisement -

KTR held Meeting with TRS Leaders in Khammam

ఈనెల 18, 19న రాష్ట్ర కమిటీ సమావేశంలో వెల్లడి
ఉమ్మడి జిల్లా టిఆర్‌ఎస్ శ్రేణులకు కెటిఆర్ సమాచారం
సర్వే నివేదికల ఆధారంగానే గెలుపు గుర్రాలకే టికెట్లు
ఎన్నికలు ఎప్పుడైన రావొచ్చు.. సిద్ధంగా ఉండండి
ఖమ్మం జిల్లా నేతలకు కెటిఆర్ దిశా నిర్దేశం
మన తెలంగాణ/ఖమ్మం ప్రతినిధి: టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ ఏర్పాటు చేయబోయే జాతీయ పార్టీపై ఈనెల 19 లోపు కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు శనివారం ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలకు సూచనప్రాయంగా చెప్పారు. శనివారం ఖమ్మం వచ్చిన సందర్బంగా జిల్లా టిఆర్‌ఎస్ కార్యాలయంలో ఉమ్మడి జిల్లాకు చెందిన ముఖ్యనేతలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎంపిలు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, మాజీ ఎంఎల్‌ఎలు, కార్పొరేషన్ చై ర్మన్లు, పోటీ చేసి ఒడిపోయిన ముఖ్యులతో కెటిఆర్ భేటీ అ య్యారు. ఈ సందర్భంగా సమావేశంలో జాతీయ పార్టీ అంశం గురించి కెటిఆర్ ప్రస్తావించారు. ఈనెల 18 లేదా 19న రాష్ట్ర కమిటి సమావేశం జరుగుతుందని, సమావేశంలో జాతీయ పార్టీపై కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంటుందని జిల్లా నేతల దృష్టికి తెచ్చినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న వివక్షను ఎంతకాలం భరించాలని సమావేశంలో ఆయన పార్టీ నేతలను అడిగారు. మనం డిఫెన్స్‌లో పడకుండా మనదే పైచేయిగా ఉండాలనే ఉద్దేశ్యంతో జాతీయస్థాయిలో పార్టీ ఏర్పాటు అనివార్యం అవుతుందని, దీనిపై సిఎం కెసిఆర్ పార్టీ కమిటి సమావేశంలో ప్రకటించే అవకాశం ఉందన్నారు. జాతీయ స్థాయిలో బిజెపిని గట్టిగా ఎదుర్కోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మీకు తెలియజేసేందుకే మీతో ప్రత్యేకంగా సమావేశం అయ్యానని కెటిఆర్ అన్నట్లు తెలిసింది.

ఈనెల 19లోపు మరోసారి జిల్లా ముఖ్య నేతలతో హైదరాబాద్‌లో మరోసారి సమావేశం అవుతామన్నారు. ఇదే సందర్భంలో ఆయన.. ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని, ఈసారి గెలుపు గుర్రాలకే టిక్కెట్లు లభిస్తాయని, సిట్టింగ్‌లందరూ ఆశ పెట్టుకోవద్దని అన్నట్లు సమాచారం. టికెట్ మాకే ఖాయం అన్న ధీమాగా ఎవ్వరూ ఉండవద్దని, సర్వేలో వచ్చిన రిపోర్టుల ఆధారం గా టిక్కెట్లు ఇచ్చే పరిస్థితి ఉంటుందని ఖరాఖండిగా తేల్చి చెప్పేశారు. ఉమ్మడి జిల్లాలో పదికి పది స్థ్దానాలు గెల్చు కోవాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో ఎవ్వరి ప్రాబ ల్యం కోసం వారు ప్రాకులాడుతున్నారని.. ఇది పార్టీకి నష్టం చేకూరుతుందని అంతా కలిసి సమష్టిగా పార్టీ కోసం పనిచేయాలని పరోక్షంగా ఆయన తుమ్మల, పొంగులేటిని దృష్టిలో పెట్టుకొని ప్రస్తావించినట్లు తెలిసింది. విభేదాలు ఉన్నా.. పక్కనపెట్టి ఐక్యంగా ముందుకుసాగాలని సూచించినట్టు తెలిసింది. ఎమ్మెల్యేలంతా మాజీలందరిని పార్టీ కార్యక్రమాలకు తప్పక ఆహ్వానించాలని పరోక్షంగా తుమ్మల, పొంగు లేటిలను దృష్టిలో పెట్టుకొని అదేశించినట్లు సమాచారం. ఇదే సందర్భంలో మంత్రి పువ్వాడను కూడా అందరిని కలుపుకోని వెళ్ళాలని సూచించినట్లు తెలిసింది. కాగా, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు గైర్హాజరయ్యారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News