Friday, November 22, 2024

మనసున్న రామన్న ఇద్దరు అంగవైకల్యుల చికిత్సకు హామీ

- Advertisement -
- Advertisement -

 

మనతెలంగాణ/హైదరాబాద్: నడవలేని స్థితిలో ఉన్న ఇద్దరు యువకుల చికిత్సకు మంత్రి కెటిఆర్ సాయం చేస్తానని హామీ ఇచ్చి తన ఉదారతను మరోసారి చాటుకున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం పాలకుర్తి గ్రామానికి చెందిన యువకులు గుంపుల సతీష్, ప్రేమ్‌కుమార్ అంగవైకల్యంతో పూర్తిగా నడవలేని స్థితిలో బాధపడుతున్నారు. యువకుల దీన పరిస్థితిని రామంగుండం శాసన సభ్యులు కోరుకంటి చందర్ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కెటిఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. వీరి ఆరోగ్య పరిస్థితిని చూసి చలించిన కెటిఆర్ తక్షణమే చికిత్సకు హామీ ఇచ్చారు. వెనువెంటనే సన్షైన్ హాస్పిటల్ గురువారెడ్డితో మాట్లాడి వైద్యం అందించాల్సిందిగా కోరారు. వీరిద్దరి వైద్యానికి అయ్యే ఖర్చు రూ.20 లక్షలను పూర్తిగా ఇస్తానని హామీ ఇచ్చారు. దీనిపై ఎంఎల్‌ఎ కోరుకంటి చందర్ స్పందిస్తూ ప్రజా సేవలో మంత్రి కెటిఆర్ తనకు తానే సాటి అని మరోమారు చాటారని కొనియాడారు. గొప్ప మనస్సుతో స్పందించిన మంచి మనసున్న రామన్నకు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News