Wednesday, January 22, 2025

మానవత్వం చాటుకున్న మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

చేగుంట: జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను ఐటి శాఖ మంత్రి కెటిఆర్ తన వాహనంలో ఆసుపత్రికి తరలించి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. మంత్రి కెటిఆర్ ఆదివారం జిగిత్యాల జిల్లాలో జరిగిన కార్యక్రమాన్ని ముగించుకొని హైదరాబాద్‌కు వస్తుండగా మార్గమధ్యంలో చేగుంట గ్రామ శివారు బైపాస్ జాతీయ రహదారిపై ఆర్‌టిసి బస్సును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న పలువురికి గాయాలు కాగా అటుగా వెళుతున్న కెటిఆర్ వారిని చూసి ఆగి పరామర్శించారు. వెంటనే తన కాన్వాయి ఉన్న వాహనంలో తూప్రాన్ ఆసుపత్రికి తరలించారు. అయితే మంత్రి కెటిఆర్ చూపిన ఔదార్యంతో స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News