Tuesday, December 24, 2024

ఛత్తీస్‌గఢ్‌లో ఎకరానికి రెండు వేల రూపాయలు ఇచ్చే దిక్కేలేదు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

 

ములుగు: నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో 14 ఏళ్లు పోరాడి తెలంగాణ తెచ్చుకున్నామని మంత్రి కెటిఆర్ తెలిపారు. ములుగులో మోడల్ బస్టాండ్, కలెక్టరేట్‌కు మంత్రి కెటిఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ములుగు జిల్లా రూపు రేఖలు మారుస్తున్నామన్నారు. దాశరథి తెలంగాణను కోటి రతనాల వీణ అన్నారని, కోటిన్నర ఎకరాల మాగాణి అని సిఎం కెసిఆర్ రుజువు చేశారని ప్రశంసించారు.

Also Read: నితీశ్ ఆరాటానికి ఆటంకాలు!

వేసవి కాలంలో చెరువులు మత్తడి దూకుతాయా? అని ఎప్పుడైనా అనుకున్నామా? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 70 ఏళ్ల కాంగ్రెస్ పాలన మనకు బాగా తెలుసునని, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరానికి 12 క్వింటాళ్ల వరి మాత్రమే కొంటోందన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో ఎకరానికి రెండు వేల రూపాయలు ఇచ్చే దిక్కులేదని విమర్శించారు. మనం ఎకరానికి పది వేల రూపాయలు ఇచ్చి రైతులను ఆదుకుంటున్నామని కొనియాడారు. 3146 తండాలు, గూడేలను గ్రామ పంచాయతీలుగా మార్చామని, ములుగు గ్రామ పంచాయతీని మున్సిపాలిటీ చేసుకున్నామని ప్రశంసించారు. 65 కోట్ల రూపాయలతో నిర్మించే కలెక్టరేట్‌కు శంకుస్థాపన చేశామని, రూ.38 కోట్లతో నిర్మించే ఎస్‌పి కార్యాలయానికి శంకుస్థాపన చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్ రారు, సత్యవతి రాథోడ్, ఎంఎల్‌ఎ సీతక్క, స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News