Sunday, January 19, 2025

రుద్రంగిలో కెజిబివిని ప్రారంభించిన కెటిఆర్

- Advertisement -
- Advertisement -

రాజన్నసిరిసిల్ల: రుద్రంగి మండల కేంద్రము లో రూ.3 కోట్ల 50 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన కెజిబివిని మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి, ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు మాట్లాడారు. ఇచ్చిన హామీ మేరకు మంత్రి తారక రామారావు కెజిబివిని ప్రారంభానికి వచ్చారన్నారు. కలికోట సూరమ్మతో పాటు ఎల్లంపల్లి ప్రాజెక్టు సాగునీరుతో రుద్రంగీలో వడ్లు ఆర పొద్దామంటే ఇంచు స్థలం లేకుండా పోయిందన్నారు. కళ్యాణ లక్ష్మి పథకం క్రింద నియోజకవర్గానికి 66 కోట్ల రూపాయలు వచ్చాయని చెన్నమనేని వివరించారు. రుద్రంగిలో వచ్చే ఫిబ్రవరిలో 30 పడకల ఆసుపత్రి మంజూరు చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హామీ ఇచ్చారు. వేములవాడ నియోజకవర్గంలో రైతు బంధు కింద 60 వేల 62 మంది రైతులకు ఇప్పటి వరకూ 562 కోట్లు ఇచ్చామన్నారు. రుద్రంగి, మానాల రెండు కండ్లు అని మంత్రి కెటిఆర్ సహకారంతో రెండింటిని అభివృద్ధి చేస్తామని, సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని ఆయన వివరించారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News