Monday, December 23, 2024

ఎల్లుండి వెస్ట్ మారేడ్‌పల్లిలో డబుల్ ఇళ్లను ప్రారంభించనున్న మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

KTR inaugurated in Double bedroom house

మన తెలంగాణ/సిటీ బ్యూరో: నిరుపేదల ఆత్మగౌరవ లోంగిళ్లైన మరిన్ని ప్రభుత్వ డబుల్ బెడ్ రూం ఇళ్లను లబ్దిదారులు అందుకోనున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని వెస్ట్ మారేడ్‌పల్లిలో రూ.36.27 కోట్ల వ్యయంతో 5.18 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన 468 డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రారంభానికి జిహెచ్‌ఎంసి అధికారులు ముహూర్తం ఖరారు చేశారు. గురువారం ఉదయం 9.30 గంటలకు పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు తన చేతుల మీదగా ఈ ఇళ్లను లబ్దిదారులకు అందజేయనున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్‌రెడ్డి, ఎమ్మెల్యే సాయన్న తదితరులు పాల్గొనున్నన్నారు. రూ.3.51 కోట్ల వ్యయంతో ఈ డబుల్ బెడ్ ఏ రూం ఇళ్ల సముదాయంలో మౌలిక సదుపాయాలను కల్పించారు. రోడ్లు, డ్రైనేసీ, విద్యుత్ సౌకర్యంతో పాటు మంచినీటి సౌకర్యం కోసం 50 వేల లీటర్ల సామర్థంతో 4 సంపులను నిర్మించారు.

నేడు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలన:

వెస్ మారేడ్‌పల్లిలో గురువారం ప్రారంభించనున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల సముదాయాన్ని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా ఆయన గురువారం ప్రారంభోత్స ఏర్పాట్లను అధికారులతో సమిక్ష సమావేశం నిర్వహించనున్నారు.ఇందుకు సంబంధించిన వివరాలను మంగళవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాకు వెల్లడించారు. ఇంతకు ముందు హౌసింగ్ బోర్డుకు చెందిన ఈ స్థలంలో అనేక మంది నిరుపేదలు సరైన సౌకర్యాలు లేక ఇరుకైన ఇళ్లలో జీవనం సాగించే వారి తెలిపారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు దృష్టికి తీసుకురావడంతో ఆయన వెంటనే స్పందించి ఇక్కడ డబుల్ బెడ్ రూం ఇళ్లను మంజూరు చేశారని తెలిపారు. సిఎం చోరవతో ముందుగా హౌసింగ్ బోర్డుకు చెందిన ఈ స్థలాన్ని రెవెన్యూశాఖకు బదిలీ చేసి లబ్దిదారుకలు పొజిషన్ సర్టిఫికెట్లను పంపిణీ చేసినట్లు మంత్రి వెల్లడించారు. అనంతరం ఇక్కడ డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించినట్లు తలసాని తెలిపారు. సకల సౌకర్యాలతో పేదలు తమ సొంత ఇంటిలో సంతోషంగా బ్రతుకాలన్నదే ముఖ్యమంత్రి లక్షమని చెప్పార. ప్రభుత్వమే పూర్తి ఖర్చులతో ఇళ్లను నిర్మించి లబ్దిదారులకు పూర్తిగా ఉచితంగా అందజేస్నుత్న మహోన్నత కార్యక్రమం దేశంలో ఎక్కడా లేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News