Sunday, December 22, 2024

హుస్నాబాద్‌లో షటిల్ ఆడిన మంత్రి కేటీఆర్

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట జిల్లాలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం పాల్గొన్నారు. హుస్నాబాద్ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో హుస్నాబాద్‌ చేరుకున్న కేటీఆర్‌ నేరుగా మినీస్టేడియం చేరుకున్నారు. ఈ సందర్భంగా 27.51 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు.

Also Read: రష్యా ప్రతినిధిపై పిడిగుద్దులు గుద్దిన ఉక్రెయిన్ ఎంపీ!

వీటిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఎస్టీ మహిళా వసతి గృహం, టీటీసీ కేంద్రం, బస్తీ ఆసుపత్రి, మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి. దీంతోపాటు రూ.3.50 కోట్లతో చేపట్టే హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. పట్టణంలో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను, కోటి రూపాయలతో నిర్మించిన ఇండోర్ స్టేడియంను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్తగా ప్రారంభించిన ఇండోర్ స్టేడియంలో షటిల్ గేమ్ ఆడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News