Thursday, January 23, 2025

కొడ్గల్ లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించిన కెటిఆర్

- Advertisement -
- Advertisement -

మహబూబ్ నగర్: జిల్లాలోని జడ్చర్ల మండలం కొడ్గల్ గ్రామంలో రూ.201.60 లక్షలతో నూతనంగా నిర్మించిన 40 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుతో కలిసి మంత్రులు వి.శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి లక్ష్మారెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ”కొడ్గల్ లో ఎట్లా అభివృద్ధి పనులు జరిగాయో.. తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా జరుగుతున్నాయి. సమాజంలో దళిత వాడల్లో కేవలం దళితులే ఉండాలే అన్న చందంగా ఉండేది. ప్రస్తుతం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో కుల మత భావనకు అతీతంగా అందరూ ఉంటారు. దళిత బంధు తెస్తే.. మిగతా వర్గాలను రెచ్చ గొడుతున్నారు. ఏనాడైనా మీకు ఇలాంటి ఆలోచన వచ్చిందా.. రాబోయే కాలంలో అన్ని వర్గాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ మరిన్ని పథకాలు తెస్తారు. రేపు పీఎం నరేంద్ర మోడీ మన పక్క జిల్లాకు వస్తున్నారు. 2014 కన్నా ముందు పాలమూరు వచ్చి పాలమూరు రంగా రెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామన్నారు.. మరి ఏమైంది. సీఎం కేసీఆర్ ముట్టుకుంటే దేశ వ్యాప్తంగా మా తడాఖా చూపిస్తాం. మేము ఉద్యోగాలు ఇస్తున్నాం.. మీరు పీకేస్తున్నరు. మేం కరెంటు ఉచితంగా ఇస్తే.. మీరు మీటర్లు పెడుతున్నరు. కొంత మంది మా పార్టీ నుంచి బీజేపీకి పోయి.. ఏదో ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్లా మాట్లాడుతున్నారు. మన నీటిని రాయల సీమకు తరలిస్తే హారతి పట్టిన వారు.. ఇపుడు ఏవేవో మాట్లాడుతున్నారు” అని విమర్శించారు.

KTR Inaugurates Double bedrooms in Kodgal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News