Saturday, December 21, 2024

ఆ 25 మున్సిపాలిటీలను హైదరాబాద్ గా గుర్తించాలి: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

KTR Inaugurates ORR Phase-2 Project

హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆరఆర్) పరిధిలో తాగునీటి సమస్యలను అధిగమిస్తూ శాశ్వత పరిష్కారం కోసం రూ.1200 కోట్లతో చేపడుతున్న ప్రాజెక్టులో భాగంగా రూ.587 కోట్లతో ఓఅర్ఆర్ పేజ్-2 ప్రాజెక్టును సోమవారం రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని మణికొండ అల్కాపురిలో రాష్ట్ర ఐటి, పరిశ్రమల, మునిసిపల్ శాఖ మంత్రి కె తారకరామారావు, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి కె తారకరామారావు మాట్లాడుతూ.. ”978 కాలనీలకు నీళ్లు ఇవ్వాలని మంత్రి సబితా రెడ్డి క్యాబినెట్ లో పట్టుబట్టారు. కొండపోచంపల్లి నుంచి గండి పేటకు మంచినీటి సరఫరాకు సీఎం కేసీఆర్ ఆలోచన చేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు కాగానే రూ.2 వేల కోట్లతో డ్రింకింగ్ వాటర్ స్కీమ్ తీసుకున్నాం. హైదరాబాద్ అంటే ఒక్కటే కాదు.. ఓఆర్ఆర్ లోపల ఉన్న 25 మున్సిపాలిటీలను హైదరాబాద్ గా గుర్తించాలి. హైదరాబాద్ అన్ని నగరాల కంటే వేగంగా విస్తరిస్తోంది. ఢిల్లీ, చెన్నై, ముంబయి నగరాలు వివిధ సమస్యలతో ఇబ్బంది పడుతున్నాయి. హైదరాబాద్ మహానగరంలో 2051 సంవత్సరం నాటికి అవసరమైన వసతుల కోసం ఆలోచన చేస్తున్నాం.  రూ.6 వేల కోట్లతో మంచినీటి ప్రాజెక్టులు చేపట్టాం. చెన్నై లాంటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. కాళేశ్వరం ఇరిగేషన్ కోసం మాత్రమే కాదు.. మల్లన్నసాగర్, కొండ పోచమ్మ రిజర్వాయర్ల ద్వారా నీటిని హైదరాబాద్ తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం” అని మంత్రి అన్నారు.

KTR Inaugurates ORR Phase-2 Project

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News