Monday, December 23, 2024

అందుకే ఎఐజి ప్రారంభించాం: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అందరికీ వైద్యం అందుబాటులో ఉండాలనే ఎఐజి ప్రారంభించామని మంత్రి కెటిఆర్ తెలిపారు. మహిళ ఎఐజి ఉమెన్ ఆస్పత్రి ప్రారంభించిన సందర్భంగా కెటిఆర్ మాట్లాడారు. కొన్నేళ్లుగా ఇండియా మెడికల్ ఫీల్డ్ ఎంతో పురోగతి సాధించిందన్నారు. వైద్యవృత్తిలో మహిళలు రాణిస్తున్నారని ప్రశంసించారు. జెండర్ ఈక్వాలిటీ పాటించే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని చెప్పారు. తెలంగాణలో మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేశామని వివరించారు.

సైబరాబాద్ కమిషనరేట్‌లో తెలంగాణ స్టేట్ పోలీస్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ సైబర్ సెఫ్టీ సెంటర్‌ను మంత్రులు మహమూద్ అలీ, కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడారు. సైబర్ భద్రత అనేది ఇప్పుడు అతి పెద్ద ఛాలెంజ్‌గా మారిందన్నారు. సైబర్ క్రైమ్ ఫిర్యాదు చేయడానికి 1930 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశామన్నారు. సైబర్ నేరస్థుల చేతుల్లో మోసపోయిన వారు ఫిర్యాదు చేయడానికి కూడా సిగ్గు పడుతున్నారన్నారు. బాడీ వోర్న్ కెమెరాల వల్ల ట్రాఫిక్ పోలీసులకు భరోసా వచ్చిందన్నారు. సైబర్ నేరాలపై పోలీస్ సిబ్బందికి మరింత శిక్షణ ఇస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News