Monday, January 20, 2025

టైకాన్ కేరళ 2024కు కెటిఆర్‌కు ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావును ప్రతిష్టాత్మక టైకాన్ కేరళ 2024కి గౌరవ అతిథిగా ఆహ్వానించారు. ది ఇండస్ ఎంట్రప్రెన్యూర్స్(టిఐఇ) నిర్వహణలో ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సు డిసెంబర్ 4, 5 తేదీలలో తేదీల్లో కోచిన్‌లోని గ్రాండ్ హయత్ హోటల్‌లో జరుగనున్నది. కేరళ రాష్ట్రంలోనే అతిపెద్ద ఈవెంట్‌గా పేరు ఉన్న 13వ టైకాన్‌కు వివిధ రంగాల సిఇఒలు, స్టార్టప్ వ్యవస్థాపకులు, పరిశ్రమ నిపుణుల వంటి వెయ్యికి మందికి పైగా పాల్గొననున్నారు. ఈ ఏడాది థీమ్, ‘మిషన్ 2030 ట్రాన్స్‌ఫార్మింగ్ కేరళ’.. కేరళ ఆర్థిక వ్యవస్థను ఆధునీకరించేందుకు అవసరమైన ప్రణాళికలను వ్యూహాలను ఈ సదస్సు చర్చించనున్నది.

డిసెంబర్ 5వ తేదీన సాయంత్రం 4 గంటలకు జరిగే టైకాన్ అవార్డ్, ముగింపు వేడుకలకు కెటిఆర్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. తెలంగాణ అభివృద్ధిలో కెటిఆర్ చూపిన గొప్ప నాయకత్వం, ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లను తెలంగాణలో పెంపొందించడంలో ఆయన చేపట్టిన కార్యక్రమాలు, అనుసరించిన వ్యూహాలు, ఆలోచనలు ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి గొప్ప స్ఫూర్తిని కలిగిస్తాయని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు. కెటిఆర్ పాల్గొనడం ద్వారా ఈ సమావేశానికి మరింత ప్రాధాన్యత ఏర్పడుతుందని, యువ ఆంట్రప్రెన్యూర్స్‌కు ప్రేరణ కలిగిస్తుందని టిఐఇ కేరళ అధ్యక్షులు జాకబ్ జోయ్, టైఇకాన్ కేరళ 2024 చైర్మన్ వివేక్ కృష్ణ గోవింద్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News