Thursday, December 26, 2024

కెటిఆర్ ఓ జూనియర్ ఆర్టిస్ట్

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ లో ఓ జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నారని పోరోక్షంగా కెటిఆర్ ను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. ఆ ఆర్టిస్ట్ ఆటోలో కెమెరాలు పెట్టుకుని ఆటోరాముడు డ్రామాలు చేశాడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కిరాయి ఎల్తలేదని, సంసారం నడుస్తలేదని ఆటో తగులబెట్టుకుం టారా ఇది వారికి మరింత ఆర్థిక నష్టమే కదా అని సిఎం రేవంత్ అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తే బిఆర్‌ఎస్ విమర్శిస్తోందన్నారు. సిఎం స్థానంలో ఓ రైతు బిడ్డ కూర్చోవడం బిఆర్‌ఎస్ జీర్ణించుకోలేకపోతుందన్నారు. ఇక్కడి వారెవరూ ఆషామాషీగా ఇక్కడకు రాలేదని ఎవరి మాదిరిగానో మేనేజ్ మెంట్ కోటాలో ఉద్యమం ముసుగులోనో రాలేదని ఆయన దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News