Wednesday, January 22, 2025

తెలంగాణ యువతకు ఐకాన్ కెటిఆర్

- Advertisement -
- Advertisement -

గోదావరిఖని: తెలంగాణ యువతకు ఐకాన్ బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటి, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అని బిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. మంత్రి కెటిఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో సోమవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఆయన పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా రామగుండం కార్పొరేషన్ 28వ డివిజన్‌లో నివాసముండే పేద కుటుంబానికి చెందిన మహ్మద్ సలీంకు ఇళ్లు బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరుకంటి చందర్ రిబ్బన్ కట్ చేసి గృహ ప్రవేశం చేపట్టారు. గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించారు.

ఈ సందర్భంగా పలువురు యువకులు ముందుకు వచ్చి రక్తదానం చేశారు. అదేవిధంగా ఆసుపత్రిలోని రోగులకు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పండ్లు పంపిణీ చేశారు. గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 40 మంది క్యాన్సర్ పేషంట్లకు 521 రూపాయల చొప్పన ఎమ్మెల్యే పెన్షన్‌అందించారు. స్థానిక గాంధీ పార్కు ప్రభుత్వ పాఠశాలలో జ్యోతి గాంధీ ఫౌండేషన్ ద్వారా నిరుపేద విద్యార్థులకు పాకెట్ మనీ అందజేశారు.

వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, ఫ్యాక్స్ చైర్మన్ మామిడాల ప్రభాకర్, డిప్యూటీ మేయర్ నడిపల్లి అభిషేక్ రావు, కార్పొరేటర్లు దొంత శ్రీనివాస్, దాతు శ్రీనివాస్, జనగామ కవిత సరోజిని, బాలరాజ్‌కుమార్, కో ఆప్షన్ సభ్యులు వంగ శ్రీనివాస్ గౌడ్, చెరుకు బుచ్చిరెడ్డి, నాయకులు పర్లపల్లి రవి, నారాయణదాసు మారుతి, జ్యోతి గాంధీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు దయానంద్ గాంధీ, తానిపర్తి గోపాల్ రావు, చెలుకలపల్లి శ్రీనివాస్, దొమ్మేటి వాసు, పులి రాకేష్, జాహిద్ పాషా, సిరాజోద్దిన్, కలువల సంజీవ్, కాల్వ శ్రీనివాస్, గంగ శ్రీను, తోకల రమేష్, శరత్, ముద్దసాని సంధ్యారెడ్డి తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News