Wednesday, January 22, 2025

తండ్రికి తగ్గ తనయుడు కెటిఆర్

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: బిఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడుగా, రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రిగా కల్వకుంట్ల తారకరామారావు తన మార్క్ చూపిస్తూ తండ్రికి తగ్గ తనయుడుగా పేరు గడించారని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. ఆదివారం స్థానిక బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో కెటిఆర్ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ బర్త్‌డే కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఐటి, పురపాలక శాఖ మంత్రిగా బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహిస్తూ ఐటి రంగంలో దేశంలోనే హైదరాబాద్‌ను అగ్రభాగాన నిలిపిన ఘనత కెటిఆర్‌కే దక్కుతుందన్నారు. పలు దేశ, విదేశీ కంపెనీలను హైదరాబాద్‌కు తీసుకొచ్చి వేల కోట్ల పెట్టుబడులు పెట్టించి, లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించారన్నారు. నూతన పురపాలక చట్టంతో మున్సిపాలిటీల అభివృద్ది, టిఎస్‌బిపాస్‌తో ప్రజలకు సేవలను చేరువ చేశారన్నారు.

ప్రతి నెలా మున్సిపాలిటీలకు నిధుల ఇస్తూ పట్టణ అభివృద్దికి కృషి చేస్తున్నారన్నారు. ఏన్నో ఏళ్లుగా జగిత్యాలలో జోన్‌ల సమస్యతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని, జోన్‌ల మార్పు గురించి మంత్రి కెటిఆర్‌కు వివరించగానే ఆయన ప్రత్యేక చొరవ చూపి ఒకే సారి 14 జోన్‌లను మార్చి ప్రజల ఇబ్బందులను తొలగించారన్నారు. తెలంగాణ ప్రజల అభివృద్ది, సంక్షేమం గురించి నిరంతరం తపించే కెటిఆర్ ఆయురారోగ్యాలతో ఉండి ప్రజలకు మరింత సేవ చేయాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్లు, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News