కార్యాచరణకు సిద్ధమవుతున్న
భారత రాష్ట్ర సమితి
శంభీపూర్ రాజు నివాసంలో
సీనియర్ బిఆర్‌ఎస్ బిసి
నేతలతో కెటిఆర్ భేటీ కుల
గణనతో బిసిలకు అన్యాయం
జరిగిందన్న నేతలు రేపు
తెలంగాణ భవన్‌లో ప్రత్యేక
సమావేశం కార్యాచరణపై చర్చించే అవకాశం
మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ బిసి వర్గాలకు అన్యాయం చేస్తున్నదంటూ బిఆ ర్‌ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో కార్యాచరణ చేపట్టేందుకు సమాయత్తం అవుతున్నది. ఇందులో భాగంగా శుక్రవారం అందుబాటులో ఉన్న బిసి నేతలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ స మావేశమయ్యారు. ఎంఎల్‌సి శంభీపూర్ రాజు నివాసంలో జరిగిన ఈ సమావేశంలో పార్టీకి చెందిన పలువురు సీనియర్ బిసి నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బిసిలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమ లు చేయలేదని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీల మాదిరే బిసిలకు ఇచ్చిన హామీలను కూ డా డొల్ల అన్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నా రని ఈ సందర్భంగా జరిగిన చర్చలో ప్రస్తావిం చారు. కాంగ్రెస్ పార్టీ బిసిలకు హామీలు ఇచ్చి, మాట తప్పిందని దీనిపై బిసి వర్గాలను మరింత చైతన్యం చేయాలన్న దిశగా పార్టీ కార్యచరణ రూపొందించేందుకు సిద్ధమైంది.
తాజాగా బిసిలకు స్థానిక సంస్థలో 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తామంటూ ఇందుకు సంబంధించి కులగణన పేరుతో ప్రకటించిన గణాంకాల్లో బిసి వర్గాలకు తీవ్రమైన అన్యాయం జరిగిందన్న అభిప్రా యం ఈ సమావేశంలో వ్యక్తం అయింది. కాం గ్రెస్ పార్టీ కావాలనే బిసి వర్గాల సంఖ్యను భారీ గా తగ్గించిందని బిసి నేతలు అభిప్రాయపడ్డా రు. బిసిల జనాభాను తగ్గించి కాంగ్రెస్ పార్టీ బిసి వర్గాలకు తీవ్రమైన అన్యాయం చేసిందని దీన్ని ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలన్న సూచనప్రాయ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ తరఫున బిసి వర్గాలకు అందించిన సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాజకీయ అవకాశాలను, ఇచ్చిన పార్లమెంట్, అసెంబ్లీ సీట్లకు సంబంధించిన అ వకాశాలను కూలంకషంగా చర్చించారు. బిసిలకు అండగా తరువాయి 10లో