Monday, December 23, 2024

బాచుపల్లి-ఓఆర్ఆర్ ఫ్లై ఓవర్ కు మంత్రి కెటిఆర్ శంకుస్థాపన..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని నిజాంపేట్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో రూ.138 కోట్ల వ్యయంతో చేపట్టిన బాచూపల్లి రోడ్డు విస్తరణలో భాగంగా బాచూపల్లి నుంచి ఓఆర్ఆర్ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులకు రాష్ట్ర ఐటి, పరిశ్రమల, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. భవిష్యత్ లో హైదరాబాద్ మహానగరం మరింత విస్తరించనుందని, దాన్ని దృష్టిలో పెట్టుకుని శివార్లలో మౌలిక వసతులు పెంచుతున్నామని అన్నారు. ప్రస్తుతం నగర శివారులోని గ్రామాలన్నీ మున్సిపాలిటీలుగా మారాయని.. గతంలో వారానికోసారి మంచినీరు వచ్చేదని, ఇప్పడు ఆ పరిస్థితి లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, నిజాంపేట మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే వివేక్, ఎమ్మెల్సీలు శంభి పూర్ రాజు, సురభి వాణి దేవి తదితర నేతలు పాల్గొన్నారు.

ఇక, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజుల‌రామారంలో పచ్చదనంతో పాటు ఆహ్లాదం, ఆరోగ్యం అందే విధంగా 450 హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన “ప్రాణ‌వాయువు అర్బ‌న్ ఫారెస్ట్ పార్కు” ను ప్రారంభించిన మంత్రి ప్రారంభించారు.

KTR Laid foundation stone to Bachupally Flyover

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News