- Advertisement -
హైదరాబాద్: పారిశుద్ధ్య కార్మికుల జీతాలను రూ.8 వేల నుంచి 17 వేలకు పెంచామని ఐటి మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. పాతబస్తీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు మంత్రి కెటిఆర్ శ్రీకారం చుట్టారు. రూ.495 కోట్ల విలువైన ఆరు పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. మీర్‌ఆలం చెరువు వద్ద మ్యూజికల్ ఫౌంటైన్ కెటిఆర్ ప్రారంభించారు. ఎస్‌టిపిల నిర్మాణం, కాలాపత్తర్ పోలీస్ స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు. బహదూర్‌పుర ఫ్లైఓవర్‌ను మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పారిశుద్ధ కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పెట్రోల్, డీజిల్, సిలిండర్ ధరలు పెంచింది మోడీ ప్రభుత్వమేనని తాము కాదన్నారు.
- Advertisement -