Monday, December 23, 2024

దశరథ్ ’కథా రచన’ పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

ప్రముఖ దర్శక రచయిత దశరథ్ రాసిన ’కథా రచన’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి కేటీఆర్ ముఖ్య అతిధిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దర్శకులు వివి వినాయక్. హరీష్ శంకర్, నాగ్ అశ్విన్ అతిధులుగా పాల్గొన్నారు. విఎన్ ఆదిత్య, కాశీ విశ్వనాథ్, మహేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ “నాకు సినిమా అంటే ఇష్టం. సినిమా అనే కాదు క్రియేటివ్ కంటెంట్. పుస్తకాలు, పేపర్లు చదవడం ఇష్టం. మంచి పుస్తకం కనిపిస్తే చదవాలనే ఆసక్తివుంటుంది. అలాగే మొదటి నుండి విజువల్ కంటెంట్ ఇష్టం. ఒక కథని చిత్ర రూపంలో మనసుని హత్తుకునేలా చెప్పడం ఒక గొప్ప నైపుణ్యం. కథని అలా చెప్పడానికి ఒక సామర్థ్యం కావాలి. అలాంటి సామర్థ్యం ఇలాంటి మంచి పుస్తకాలు చదవడం ద్వారా వస్తుంది.

’కథా రచన’ లాంటి అద్భుతమైన పుస్తకం వచ్చినపుడు మనం ప్రచురించాలని ముందుకు వచ్చిన భాషా సాంస్కృతిక డైరెక్టర్ మామిడి హరికృష్ణకి, మంత్రి శ్రీనివాస యాదవ్‌కి అభినందనలు. ఇంత చక్కటి పుస్తకం రాసిన దశరథ్‌కి ప్రత్యేమైన కృతజ్ఞతలు. ఒక సినిమా ప్రేక్షకుల మనసుని హత్తుకోవాలన్న, వాళ్ళు గుర్తుపెట్టుకోవాలన్నా, విజయం సాధించాలన్నా చక్కని స్క్రీన్ ప్లే, నేరేషన్, స్టొరీ టెల్లింగ్ కావాలి. ఈ విషయంలో దశరథ్ ’కథా రచన’ పుస్తకం ఔత్సాహికులకు ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను”అని అన్నారు.

దశరథ్ మాట్లాడుతూ “మంత్రి కేటీఆర్ చేతుల మీదగా ఈ పుస్తక అవిష్కరణ జరగడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ పుస్తకాన్ని చదివి చాలా ఇష్టపడి భాషా సాంస్కృతిక శాఖ ద్వారా విడుదల చేయడానికి సహకరించిన మామిడి హరికృష్ణకి, మంత్రి శ్రీనివాస యాదవ్‌కి కృతజ్ఞతలు. ఈ పుస్తకాన్ని ముందు మాట రాసిన దర్శకుడు సుకుమార్‌కి కృతజ్ఞతలు. తెలుగులో మంచి స్క్రీన్ ప్లే పుస్తకం ఉండాలనే తపనతో దాదాపు 14 నెలలు శ్రమించి రాసిన పుస్తకం ఇది. ఇది అందరికీ ఉపయోగపడుతుందని మనస్పూర్తిగా నమ్ముతున్నాను. ఒక రచయిత, దర్శకుడు యూనిక్‌గా ఎలా ముందుకు వెళ్ళాలనేది ఇందులో వుంటుంది”అని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News