కెసిఆర్ ఇచ్చిన 24గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా హామీని విజయవంతం చేశారు
విద్యుత్ ఇంజినీర్ల అసోసియేషన్ 2020-21 డైరీ, క్యాలెండర్లను ఆవిష్కరిస్తూ మంతి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో విద్యుత్ ఉద్యోగుల పాత్ర చిరస్మరణీయంగా నిలిచిపోతుందని రాష్ట్ర ఐటి, మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారా వు పేర్కొన్నారు. దానికి అనుగుణంగా కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో సైతం విద్యుత్ ఉద్యోగుల పనితీరుతోనే అద్భుత ఫలితాలు వస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. విద్యుత్ ఇంజనీర్ల అసోసియేషన్ రూపొందించిన 2021 డైరీ, క్యాలెండర్‌లను విద్యుత్ శాఖ మం త్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డిలతో కలసి ఆయన సోమవా రం ఉదయం ప్రగతిభవన్‌లో ఆవిష్కరించారు. ఈసందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ ఉద్యమం సమయంలో ఉద్యమ నేతగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన హామీలో భాగంగా 24 గంటల నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరా విజయవంతం చేయడం వెనుక విద్యుత్ సంస్థల యాజమాన్యాలు, సిబ్బంది తోడ్పాటు ఉందన్నారు. సాధక బాధకాలు తెలిసిన వారికే యాజమాన్య బాధ్యతలు అప్పగించడం ద్వారా సత్ఫలితాలు సాధించవచ్చని ముఖ్యమంత్రి కెసిఆర్ రుజువు చేశారని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచనల మేరకు రాష్ట్రంలో వెలుగులు విరజిమ్ముతున్న విద్యుత్ శాఖ మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్‌కో అండ్ జెన్‌కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు, టిఎస్‌ఎస్పిడిసిఎల్ సి ఎండి రఘుమారెడ్డిలతో పాటు విద్యుత్ ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ, ప్రధాన కార్యదర్శి రామేశ్వర్ శెట్టి, సలహాదారుడు అలుగుబెల్లి సురేందర్ రెడ్డి, కంపెనీ అధ్యక్షులు తుల్జారం సింగ్, లక్ష్మయ్యలతో పాటు కార్యదర్శి వై.నరసింహ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
KTR Launches Electric Engineers Association Calendar 2021