Thursday, January 16, 2025

బ్రెయిలీ లిపిలో కెసిఆర్ జీవిత చరిత్ర..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి ఆధ్వర్యంలో అంధుల ఆరాధ్య దైవం బ్రెయిలీ లిపిలో ముద్రించిన సిఎం కెసిఆర్ జీవిత చరిత్రను ప్రగతి భవన్‌లో గురువారం మంత్రి కెటిఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పుస్తక ఆవిష్కరణకు విచ్చేసిన అంధులతో ఆ పుస్తకాన్ని చదివించుకుని అందులోని విశేషాలను వాసుదేవరెడ్డిని అడిగి తెలుసుకున్నారు.
ఇందులో కెసిఆర్ బాల్యం, విద్యాభ్యాసం, విద్యార్థి రాజకీయ జీవితం, రాజకీయంలో అనుభవించిన పదవులు, ఆయన ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, సిఎంగా ఆయన పాలన, రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను పుస్తకంలో పొందుపరిచినట్టు కెటిఆర్‌కు వాసుదేవరెడ్డి వివరించారు.

అనంతరం కెటిఆర్ మాట్లాడుతూ, దేశంలో గొప్ప నాయకుడు కెసిఆర్ అని అన్నారు. ఆయన చరిత్ర భావి తరాల వారికి తెలవాల్సిన అవసరం ఉందన్నారు. అంధులకు కూడా కెసిఆర్ చరిత్ర తెలిసే విధంగా బ్రెయిలీ లిపిలో పుస్తకాన్ని తీసుకొచ్చిన వాసుదేవరెడ్డిని ఈ సందర్భంగా కెటిఆర్ అభినందించారు. ఈ సందర్భంగా అంధ విద్యార్థులు తాము ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను మంత్రి కెటిఆర్ దృష్టికి తీసుకురాగా… అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News