Tuesday, December 24, 2024

యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్

- Advertisement -
- Advertisement -

హీరో కిరణ్ అబ్బవరం నటించిన ‘సమ్మతమే‘ ఈనెల 24న విడుదల కానుంది. యుజి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కంకణాల ప్రవీణ ఈ చిత్రాన్ని నిర్మించారు. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చాందిని చౌదరి హీరోయిన్. ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను రాష్ట్ర మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. మూడు నిమిషాల నిడివిగల ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. డైలాగ్స్ ఆసక్తికరంగా వున్నాయి. ట్రైలర్ లాంచ్ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ “ట్రైలర్ చాలా బాగుంది. కొత్త టీమ్ అయినా చాలా బాగా చేశారు. ఈనెల 24న విడుదలవుతున్న సినిమాను థియేటర్‌కు వెళ్లి చూసి ఆదరించండి”అని అన్నారు.

నిర్మాత కంకణాల ప్రవీణ మాట్లాడుతూ “ఫ్యామిలీతో చూడాల్సిన చిత్రమిది. చిన్న పిల్ల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ ఈ సినిమా నచ్చుతుంది”అని చెప్పారు. దర్శకుడు గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ “ఈ సినిమా గీతా డిస్ట్రిబ్యూటర్స్ నుంచి రిలీజవుతోంది. ఈ సినిమాలో హీరో కిరణ్ అబ్బవరం అద్భుతంగా నటించారు”అని చెప్పారు. హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ “ఈ సినిమా రిలీజ్ కావడానికి సాయం చేస్తున్న అల్లు అరవింద్, బన్నీ వాసులకు ధన్యవాదాలు. సినిమా విజయం పట్ల మేం చాలా నమ్మకంగా ఉన్నాం. ఇది యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్. ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చు”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ చాందిని పాల్గొన్నారు.

KTR launches Sammathame Movie Trailer 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News