హైదరాబాద్: నిజాం కళాశాలలో బాలుర వసతిగృహ, న్యూ కాలేజ్ బ్లాక్ నిర్మాణానికి రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహముద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. నేను నిజాం కళాశాలలో చదువుకున్నాను. నిజాం కళాశాలతో అనేక జ్ఞాపకాలు ఉన్నాయి.
గతంలో ఈ కాలేజీలో డిగ్రీ చదువుతున్న బాలికలకు హాస్టల్ వసతి లేకపోవడంతో వెంటనే నిర్మాణం చేసి, ప్రారంభించుకున్నాం. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన పేద విద్యార్థులకు వసతి సౌకర్యం ఉండాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. తెలంగాణ వచ్చాక అనేక నిధులు కేటాయిస్తున్నాం. రూ.144 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. విద్యాశాఖకు నిధులకు అదనంగా పురపాలక శాఖలోని హెచ్ఎండిఎ నుంచి రూ.40.75 కోట్లు ఇచ్చాం. నేడు బాయ్స్ హాస్టల్‌తోపాటు అదనపు తరగతి గదులను నిర్మించుకోబోతున్నాం. వచ్చే 15 నెలల్లో భవనాల నిర్మాణాలను పూర్తిచేస్తాం. అని పేర్కొన్నారు.