Wednesday, January 22, 2025

ఉప్పల్ లో జెన్ ప్యాక్ట్ క్యాంపస్ కు కెటిఆర్ భూమి పూజ..

- Advertisement -
- Advertisement -

KTR laying foundation stone for genpact in Uppal

హైదరాబాద్: నగరంలోని ఉప్పల్ లో జెన్ ప్యాక్ట్ క్యాంపస్ కు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. ”ఐటి విస్తరణలో భాగంగా ఉప్పల్ లో జెన్ ప్యాక్ట్ క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నాం. ఐటిని నగరం నలువైపులా విస్తరిస్తున్నాం. హైదరాబాద్ కే ఐటి పరిమితం కాకుండా ఐటి పాలసీ తీసుకొచ్చాం. ఐటి ఉద్యోగులకు మెరుగైన జీవన ప్రమాణాలు అందేలా చర్యలు తీసకుంటున్నాం. వెస్ట్ హైదరాబాద్ కు ధీటుగా ఈస్ట్ హైదరాబాద్ లో కూడా ఐటిని విస్తరిస్తున్నాం. ఉప్పల్ లో ఐపిఎల్ మ్యాచులు ప్రారంభం అయితే మరింత అభివృద్ధి జరుగుతుంది. అలాగే, వరంగ్ లో కూడా జెన్ ప్యాక్ట్ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది” అని పేర్కొన్నాడు.

KTR laying foundation stone for genpact in Uppal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News