కామారెడ్డి: రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ నాయనమ్మ వెంకటమ్మ స్మారకార్ధం వారి గ్రామమైన కామారెడ్డి జిల్లాలోని బీబీపేట మండలం కోనాపూర్ లో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా తన వ్యక్తిగత నిధులతో నిర్మించే నూతన ప్రభుత్వ పాఠశాల భవనానికి మంత్రి కెటిఆర్ మంగళవారం శంకుస్థాపన చేశారు. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే గంపగోవర్ధన్, ఎంపీ బీబీ పాటిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… కొందరు కెసిఆర్ గురించి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. చిల్లర మాటలను పట్టించుకోమన్నారు. తెలంగాణలో 60 ఏండ్లలో జరగని అభివృద్ధి ఏడేళ్లలో చేశామన్నారు. కార్పొరేట్ స్థాయిలో స్కూళ్లను అభివృద్ధి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఎగువ మానేరులో మా నానమ్మ వందల ఎకరాల భూమి కోల్పోయారని మంత్రి వివరించారు. కెసిఆర్ పుట్టుకతోనే భూస్వామని తెలిపారు. మా కుటుంబ చరిత్ర తెలుసుకోకుండా నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రాన్ని సస్యశామలం చేశామని ఆయన పేర్కొన్నారు. సాగుకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం… 60 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం ఇస్తున్న ఏకైక రాష్ట్ర తెలంగాణ అని మంత్రి కెటిఆర్ పేర్కన్నారు.
Live: Speaking after laying foundation stone to Govt School building under Mana Ooru-Mana Badi in Konapur in Kamareddy Dist. https://t.co/KjOAmu5MnO
— KTR (@KTRTRS) May 10, 2022