Thursday, December 19, 2024

ఫార్ములా-ఈ రేస్‌ లో అవినీతి జరగలేదు.. సిఎం రేవంత్ కు కెటిఆర్ లేఖ

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ లేఖ రాశారు. ఫార్ములా-ఈ రేస్ అంశంపై శాసనసభలో చర్చ పెట్టాలన్న కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. ఈ-ఫార్ములా అంశంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని.. ఫార్ములా -ఈ రేస్‌ ఒప్పందం అంతా పారదర్శకంగా జరిగిందని చెప్పారు. ఈ రేస్‌ వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రూ.700 కోట్ల లబ్ధి చేకూరిందని అన్నారు.

హైదరాబాద్‌ నగరానికి మంచి చేసే ఈ రేస్‌ను కేవలం మీ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు బలి చేశారని.. కావాలనే దీనిపై దుష్ప్రచారం చేస్తున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. కాగా, ఈ ఫార్ములా రేసులో దాదాపు రూ.55 కోట్లను అప్పుడు మంత్రిగా ఉన్న కెటిఆర్ పక్కదారి పట్టాయని గుర్తించిన ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. కెటిఆర్ ను విచారించేందుకు ఇప్పటికే గవర్నర్ అనుమతి కూడా తీసుకున్నారు. సీఎస్ శాంతి కుమారి కూడా కెటిఆర్ ను విచారించాలని ఏసీబీకి లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కెటిఆర్ సిఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News