- Advertisement -
హైదరాబాద్: ‘ఆవో-దేఖో-సీకో’ అంటూ ప్రధాని నరేంద్రమోడీకి మంత్రి కెటిఆర్ లేఖ రాశారు. ‘‘జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేష విభజన ఎజెండా కాకుండా అభివృద్ధి, వికాసం గురించి మాట్లాడండి. పార్టీ డిఎన్ఏలో విద్వేషాన్ని, సంకుచిత్వం నింపుకున్న మీరు ప్రజలకు పనికొచ్చే విషయాలు చర్చిస్తారనుకోవడం అత్యాసే అని తెలుసు’’ అని లేఖలో పేర్కొన్నారు.
‘‘అబద్ధాల పునాదులపై పాలన సాగిస్తున్న మీకు, ఆత్మ విమర్శ చేసుకునే ధైర్యం ఉందనుకోవడం లేదు. అభివృద్ధి విషయంలో మీ పార్టీ నూతన ప్రారంభానికి తెలంగాణకు మించిన ప్రదేశం మరొకటి లేదు. తెలంగాణ ప్రాజెక్ట్‌లు, పథకాలు, పాలనా విధానాలు అధ్యయనం చేయండి. డబుల్‌ఇంజిన్‌తో ప్రజలకు ట్రబుల్‌గా మారిన మీ రాష్ట్రాల్లో అమలు చేయండి. తెలంగాణ గడ్డ నుంచి నూతన ఆలోచనా విధానానికి నాంది పలకండి’’ అంటూ తన లేఖలో కెటిఆర్ హితవు పలికారు.
- Advertisement -