Thursday, September 19, 2024

రుణమాఫీ పేరుతో రైతులను నట్టేట ముంచారు..రాహుల్‌ గాంధీకి కెటిఆర్ లేఖ

- Advertisement -
- Advertisement -

ఎన్నికల సమయంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి, ఇప్పుడు షరతుల పేరుతో కేవలం 40 శాతం మందికి మాత్రమే రుణమాఫీ చేశారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. రాష్ట్రంలో రైతులకు జరుగుతున్న అన్యాయం గురించి, రుణమాఫీ అవకతవకల గురించి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీలకు కెటిఆర్ లేఖ రాశారు. రూ.40 వేల కోట్ల రుణమాఫీ అని చెప్పి, కేవలం రూ.17 వేల కోట్లకు పైగా రుణమాఫీతో రైతులను నట్టేట ముంచారని ఆరోపించారు. రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. లక్షల మంది రైతులు ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా రోడ్లపైన ఆందోళనలు చేస్తున్నారని, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని నమ్మబలికి, మూడు విడతలుగా మోసం చేస్తూ చివరికి రైతులను ఉసూరుమనిపించారని తెలిపారు. 47 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి, కేవలం 22 లక్షల మందికి తూతూమంత్రంగా చేయడం కాంగ్రెస్ సర్కారు అసమర్థతకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోందని అన్నారు. కాంగ్రెస్ సర్కారు తన వైఖరి మార్చుకొని రాష్ట్రంలోని అన్నదాతలందరికీ ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని, అన్నదాతల పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. రైతులందరికీ రుణమాఫీ చేయకుంటే వారి తరఫున కాంగ్రెస్ పార్టీపైన పోరాడతామని లేఖలో పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News