Sunday, January 12, 2025

మేం తలచుకుంటే రాజీవ్‌, ఇందిర విగ్రహాలుండేవా?: రాహుల్‌కు కెటిఆర్ లేఖ

- Advertisement -
- Advertisement -

తెలంగాన ప్రభుత్వంపై మండిపడుతూ.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బిఆర్ఎస్ ఎమ్మెల్యే కెటిఆర్ లేఖ రాశారు. తెలంగాణ బతుకు ఛిద్రం అవుతుంటే ప్రేక్షక పాత్ర వహిస్తారా? అంటూ లేఖలో ప్రశ్నించారు. నమ్మి అధికారమిస్తే తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీస్తారా?.. పదేళ్లలో మేం పేదల బతుకులు మార్చాం తప్ప.. పేర్లు మార్చలేదని అన్నారు. బిఆర్ఎస్ తలచుకుంటే రాజీవ్‌ పేర్లు, ఇందిరా విగ్రహాలు ఉండేవా? అని.. నీచ సంస్కృతికి సీఎం రేవంత్ రెడ్డి ఫుల్‌స్టాప్‌ పెట్టకపోతే జరగబోయేది అదే అంటూ లేఖలో కేటీఆర్‌ పేర్కొన్నారు.

కాగా, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని సర్కార్ అధికారికంగా ప్రకటించలేదని.. అయినా, గ్రామాల్లో తల్లి లాగా తెలంగాణ తల్లి ఉండాలని.. అలానే విగ్రహాన్ని రూపొందించామని సిఎం రేవంత్ రెడ్డి చెప్పిన సంగతి తెలిసిిందే. డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సిఎం ఆవిష్కరించారు. అయితే, తెలంగాణ తల్లి తలపై విగ్రహం, చేతిలో బతుకమ్మ తీసేశారని.. ఆ విగ్రహం కాంగ్రెస్ తల్లిలాగా ఉందని బిఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. మేం మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విగ్రహాన్ని తీసేస్తామని హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News