Wednesday, January 22, 2025

హైదరాబాద్ మెట్రో విస్తరణ కేంద్రం నో.. కెటిఆర్ ఫైర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కేంద్రమంత్రి హర్ దీప్ సింగ్ పూరీకి రాష్ట్ర ఐటిపురపాలక శాఖల మంత్రి కెటిఆర్ మంగళవారం లేఖ రాశారు. తెలంగాణకు మెట్రోరైల్ రెండో దశ సాద్యం కాదనడం సరికాదన్నారు. కేంద్రం తమకు అనుకూల నగరాలకు మెట్రోరైల్ ప్రాజెక్టులు ఇస్తోందని ఆరోపించారు. రద్దీ తక్కువున్న నగరాలకు మెట్రోరైల్ మంజూరు చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ కు మెట్రో విస్తరణ అర్హత లేదనడం ఆశ్చర్యం వేసిదంన్నారు. అర్హత లేని పట్టణాలకు మెట్రో ఇస్తూ తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ పట్ల కేంద్రం పక్షపాత ధోరణితో ఉందన్నారు. రెండో దశ మెట్రో రైలు సమాచారాన్ని కేంద్రాని అందించామని చెప్పారు. హర్ దీప్ సింగ్ ను కలిసేందుకు అనేక సార్లు ప్రయత్నించానని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News