Monday, December 23, 2024

సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను కేంద్రం పున:ప్రారంభించాలి

- Advertisement -
- Advertisement -

GST tax on textile industry should be waived

హైదరాబాద్: ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను కేంద్ర ప్రభుత్వం పున:ప్రారంభించాలని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పురపాలక శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఈ మేరకు మంత్రి కెటిఆర్, కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, మహేంద్రనాథ్ పాండేలకు లేఖ రాశారు. ”ఆదిలాబాద్‌లోని సిమెంట్‌ కార్పోరేషన్ ఆఫ్‌ ఇండియా యూనిట్‌ను తిరిగి తెరిచేందుకు ఎన్నో సానుకూల అంశాలు, అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలోనే కాదు దేశీయంగా కూడా  సిమెంట్‌కు భారీ డిమాండ్ ఉంది. దేశంలోని ప్రైవేట్ సిమెంట్ కంపెనీలు భారీ లాభాలు ఆర్జిస్తున్నాయి. సీసీఐ కంపెనీ పున:ప్రారంభానికి  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుంది. కంపెనీ ప్రారంభిస్తామంటే కొత్త కంపెనీలకిచ్చే ప్రొత్సాహకాలు, వెసులుబాటు కల్పిస్తాం. ఇప్పటికే పలుమార్లు కేంద్రాన్ని ఈ విషయంలో కలిసి విజ్ఞప్తి చేశాము. సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరినా ఇప్పటిదాకా ఎలాంటి స్పందన రాలేదు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ నాయకత్వంలో టీయస్ఐపాస్ ద్వారా భారీగా పెట్టుబడులు తెస్తున్నాం. మా కృషి వలన అదిలాబాద్ దేవాపూర్‌ యూనిట్‌లో ఒరియంట్ సిమెంట్ కంపెనీ సుమారు రూ.1500 కోట్లు పెట్టుబడి పెట్టింది. మేం ఉపాధి, ఉద్యోగాలు కల్పిస్తుంటే, సీసీఐ లాంటి కంపెనీలను తెరవక కేంద్రం ఉపాధి అవకాశాలపై దెబ్బ కొడుతోంది. సీసీఐ తిరిగి తెరిస్తే వేలాది ఉద్యోగాలు వస్తాయి.మేం అన్ని రకాలుగా సహకరిస్తామంటున్నా సీసీఐని తెరవకపోవడం తెలంగాణ యువత, ముఖ్యంగా అదిలాబాద్ యువతకు తీరని ద్రోహమే. సీసీఐ తెరిస్తే ఆదిలాబాద్ మరింత వేగంగా అభివృద్ది చెందుతుంది. కేంద్రం ప్రభుత్వం వేంటనే సీసీఐ పున:ప్రారంభానికి చర్యలు చేపట్టాలి” అని మంత్రి లేఖలో పేర్కొన్నారు.

KTR Letter to Union Minister Nirmala Sitharaman

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News