Wednesday, January 22, 2025

తెలంగాణలో ‘హస్క్’

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా కొనసాగుతున్న మంత్రి కె.తారకరామారావు ఇంగ్లాండ్ పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. ఆదివారం లండన్‌లో మంత్రి కెటిఆర్‌తో ఇన్‌క్రెడిబుల్ హస్క్ ఇంటర్నేషనల్ గ్రూప్ ప్రతినిధులు సమావేశమయ్యారు. పొట్టు, ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ ఏర్పాటుపై చర్చించారు. 25 మిలియన్ యుఎస్‌డి డాలర్లు కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు. యూనిట్ ఏడాదికి 1000 మెట్రిక్ టన్నుల వరకు బయో పెల్లెట్ల ను ఉత్పత్తి చేస్తుందని వివరించారు. రాష్ట్రంలో పొట్టు, పునర్వినియోగ ప్లాస్టిక్‌ను సేకరించేందుకు సహకార నమూనా కోసం రోడ్‌మ్యాప్‌ను రూపొందించడానికి తెలంగాణ ప్రభుత్వంతో సహకరించేందుకు కంపెనీ ఆసక్తితో ఉందన్నారు.

రాష్ట్రంలో తమ ప్రతిపాదిత వెంచర్‌కు తెలంగాణ ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందిస్తామని మంత్రి కెటిఆర్ ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చా రు. ఈ కార్యక్రమంలో ఇన్‌క్రెడిబుల్ హస్క్ ఇంటర్నేషనల్ గ్రూప్ యుకె సిఇఒ కీత్ రిడ్జ్‌వే, ఇన్‌క్రెడిబుల్ హస్క్ ఇండియా సిఇ సీకా చంద్రశేకర్, ఐటీ, పరిశ్రమల శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రం జన్, ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ అండ్ ఎన్‌ఆర్‌ఐ వ్య వహారాల ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, చీఫ్ రిలేషన్స్ ఆఫీసర్ అమర్‌నాథ్‌రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News