Wednesday, December 25, 2024

ప్రజల కోసమే మాస్టర్‌ప్లాన్

- Advertisement -
- Advertisement -

ప్రజలకు సవివరంగా చెప్పడంలో జిల్లా
యంత్రాంగం విఫలం సకాలంలో
స్పందించి ఉంటే ప్రజలు రోడ్డెక్కేవారు
కాదు ప్రజలకు సాయం చేయడానికే
రాష్ట్ర ప్రభుత్వం ముసాయిదాపై
ప్రజల నుంచి సలహాలు, సూచనలు
తీసుకోవాలి ఇలాంటి ఘటనలు
పునరావృతం కాకుండా జాగ్రత్త
వహించండి కామారెడ్డి జిల్లా
అధికారులపై మంత్రి కెటిఆర్ ఫైర్

 

మన తెలంగాణ/హైదరాబాద్: కామారెడ్డి జిల్లాకు చెందిన సంబంధిత అధికారులపై రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ తీవ్రస్థాయిలో అసంతృప్తి, ఆగ్ర హం వ్యక్తం చేశారు. కామారెడ్డి పట్టణ మాస్టర్ ప్లాన్ ఇంకా ముసాయిదా దశలోనే ఉన్నప్పటికీ ప్రజలకు సవివరంగా ఎందుకు చెప్పలేకపోయారని ప్రశ్నించా రు. వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని మార్పులు, చేర్పులు చేసే అవకాశం కూడా ఉంది క దా అయినప్పటికీ ప్రజలు ఆందోళన చేసే పరిస్థితి వరకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని కెటిఆర్ ప్రశ్నించారు. సకాలంలోనే అధికారులు స్పందించి ఉంటేప్రజలు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చి ఉండే ది కాదని కమిషనర్‌పై ఆయన మండిపడ్డారు.

వ్యతిరేకంగా పలువురు రైతులు గురువా రం ఆందోళన చేపట్టారు. ఈ విషయంపై కెటిఆర్ స్పందిస్తూ, కామారెడ్డి జిల్లాలో జరిగిన ఘటనలు, ప రిస్థితులపై అదనపు కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నా రు. ఈ సందర్భంగా రైతుల ఆందోళనకు దారితీసిన పరిస్థితులపై కెటిఆర్ ఆరా తీశారు. ప్రభుత్వం ఎవరిని ఇబ్బంది పెట్టడానికి లేదన్నారు.ప్రజలకు సాయం చేయడానికి ఉన్నామని స్పష్టం చేశారు. నగరాల అభివృద్ధి కోసమే మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజల కోణంలోనే ప్రభుత్వ నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. ప్లాన్ ముసాయిదాపై అభ్యంతరాలు తప్పకుండా మార్పులు చేస్తామన్నారు. దీనిపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే వినతులు ఇవ్వొచ్చని, అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటామన్నారు.

ఈ నేపథ్యంలో మాస్టర్ ప్లాన్ గురించి ప్రజలకు వివరించాలని మంత్రి కెటిఆర్  సంబంధిత అధికారులకు సూచించారు. రైతులు తమ 500 ఎకరాల భూమి ఇండస్ట్రీయల్ జోన్‌కు పోతోందని ఆందోళన చెందుతున్నారన్నారు. దీనిపై ఇటీవల ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నట్లు తాను మీడియాలో కూడాలో చూశానని అన్నారు. ప్రజలు ఆందోళనతో ఉన్నప్పడు మనమే వారివద్దకు వెళ్లి ప్రశాంతంగా వివరిస్తే అర్ధం చేసుకుంటారన్నారు. అలా కాకుండా అధికారులు నిర్లక్షంగా వ్యవహరిస్తేనే ప్రజల్లో మరింత ఆగ్రహవేశాలు వ్యక్తమవుతాయన్నారు. ఇప్పటికై మాస్టార్ ప్లాన్‌కు సంబంధించిన ముసాయిదాను వారికి సమగ్రంగా వివరించాలని సంబంధిత అధికారులను ఈ సందర్భంగా కెటిఆర్ ఆదేశించారు. వారి అభిప్రాయాలను, సూచనలు, సలహాలు కూడా తీసుకుని తదనుణంగా ముసాయిదాలో మార్పులు, చేర్పులు చేయాలని సూచించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News