Wednesday, January 22, 2025

కెటిఆర్ అంటే కల్వకుంట్ల థర్డ్ క్లాస్ రామారావు

- Advertisement -
- Advertisement -

నామా గెలిస్తే కేంద్ర మంత్రి ఎలా అవుతాడు
బిఆర్‌ఎస్‌కు రెండో స్థానం వస్తే దేనికైనా సిద్ధం
కరీంనగర్ ఎంపి అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు
మనతెలంగాణ/హైదరాబాద్:  కెటిఆర్ అంటే కల్వకుంట్ల థర్డ్ క్లాస్ రామారావు అని కరీంనగర్ ఎంపి అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు అన్నారు. గురువారం గాంధీ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కెసిఆర్, కెటిఆర్ పెద్ద అబద్ధాల కోరులని ఆయన మండిపడ్డారు. ఎన్నికలు కాక ముందే బిఆర్‌ఎస్, బిజెపితో కుమ్మక్కు అయ్యిందని ఆయన ఆరోపించారు. నామా నాగేశ్వర్ రావు గెలిస్తే కేంద్ర మంత్రి అయితారని కెసిఆర్ ఎలా అన్నారని ఆయన ప్రశ్నింంచారు. దీన్ని బట్టి వాళ్ల ఫెవికాల్ బంధం బయటపడిందన్నారు. తాను, కేకే మహేందర్ రెడ్డి ఉద్యమం కోసం కష్ట పడ్డామన్నారు. కరీంనగర్‌లో బిఆర్‌ఎస్‌కు రెండో స్థానం వస్తే తాను దేనికైనా సిద్ధమని, ఒకవేళ మూడో స్థానం వస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తావా అని కెటిఆర్‌కు ఆయన సవాల్ విసిరారు. నేతన్నల చావుకు కెటిఆర్ కారణమని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నేతన్నల బకాయిలను సిఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారని ఆయన తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News