హైదరాబాద్: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగానికి ముందు అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. బిజెపి ఎంఎల్‌ఎలు ఈటెల రాజేందర్, రఘునందన్, రాజాసింగ్ వద్దకు వచ్చి కెటిఆర్ మాట్లాడారు. ఈటెల రాజేందర్‌తో మంత్రి కెటిఆర్ ప్రత్యేకంగా మాట్లాడారు. హుజూరాబాద్‌లో అధికారిక కార్యక్రమానికి రాలేదని ఈటెలను ప్రశ్నించినట్టు సమాచారం. పిలిస్తే కదా హాజరయ్యేదంటూ ఈటెల సమాధానం ఇచ్చినట్టు సమాచారం. ప్రభుత్వ విధానాలు ప్రజల్లోకి వెళ్లే విధానం సరిగాలేదని ఈటెల హితువు పలికారు. ఈటెల-కెటిఆర్ సంభాషణ మధ్యలో సిఎల్పీ నేత భట్టి విక్రమార్క జోక్యం చేసుకున్నారు. తనను కూడా అధికారిక కార్యక్రమాలకు పిలవట్లేదని ఆవేధన వ్యక్తం చేసినట్టు సమాచారం. ప్రారంభోత్సవ కార్యక్రమాలకైనా ఎంఎల్‌ఎలను ఆహ్వానించాలని కెటిఆర్‌కు ఈటెల సూచించారు. ఈటెల వ్యాఖ్యలకు మంత్రి కెటిఆర్ నవ్వి ఊరుకున్నారు. గవర్నర్ సభలోకి వస్తున్నారని కెటిఆర్‌ను ఎంఎల్‌ఎ సండ్ర వెంకటవీరయ్య అప్రమత్తం చేశారు. వెంటనే కెటిఆర్ తన ట్రెజరీ బెంచీల వైపు వెళ్లిపోయారు. కెటిఆర్ కంటే ముందు ఈటెల వద్దకొచ్చి డిప్యూటీ స్పీకర్ పద్మారావు మాట్లాడారు.
ఈటెలతో మాట్లాడిన కెటిఆర్, పద్మారావు
- Advertisement -
- Advertisement -
- Advertisement -