Monday, January 20, 2025

అబద్ధాలతోనే అందలం

- Advertisement -
- Advertisement -

అసత్యాలను నమ్ముకొని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి

దావోస్‌లో ‘గుంపుమేస్త్రీ’ నోట అన్నీ అబద్ధాలే కెసిఆర్ ఉన్నప్పుడు వారం రోజుల్లో రైతుబంధు ఎన్నికల్లో
బిఆర్‌ఎస్‌ది బాధపడేంత ఓటమి కాదు సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో కెటిఆర్

మన తెలంగాణ/కరీంనగర్ బ్యూరో : గుంపుమేస్త్రి దావోస్‌లో అన్నీ అబద్ధాలు చెప్పాడని బిఆర్‌ఎస్ వ ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎంఎల్‌ఎ కెటిఆర్ విమర్శించారు. బుధవారం కరీంనగర్‌లో బిఆర్‌ఎస్ సోషల్ మీడి యా వారియర్స్ సమావేశం నిర్వహించగా ఆయన మాట్లాడు తూ ఇదేం గుంపుమేస్త్రి పాలన అంటూ రైతులు బాధపడుతున్నా రన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై విమర్శలు ఘాటు వ్యాఖ్య లు చేశారు. మొన్న కాంగ్రెస్‌కు ఓటువేసిన వారు పశ్చత్తాపపడు తున్నారని, ఊళ్లలో రైతులు బాధపడుతున్నరని తెలిపారు. ఇదేం రా నాయన.. కెసిఆర్ ఉన్నప్పుడు వారం రోజుల్లో రైతుబంధు వ స్తుండే.. ఇదేం గుంపు మేస్త్రీ పాలనరా నాయన ఇప్పటివరకు రై తు బంధుకు దిక్కులేదు అని బాధపడుతున్నారు అని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి పదవి చేయడానికి అనుభవం ఉం దా?అంటే రేవంత్‌రెడ్డి ఏమన్నడు.. పదవి గుంపు మేస్త్రిలెక్క.. ఒకడు సున్నం కొడుతడు..ఒకడు సి మెంట్ వేస్తడు.. నేనే గిట్లగిట్ల అంటే అయిపోతది అన్న డు.. తూట్‌పాలిష్ ఏం ఉన్నది అన్నడు’ అంటూ సైటర్లు వేశారు. విదేశాలకి పోయి మాత్రం పచ్చి అబద్ధాలు చెబుతున్నడని విమర్శించారు. భరోసా వేస్తున్నామని దావోస్‌లో చెప్పిండు, రైతు భరోసా మొదలైందా? రైతు భరోసా అంటే రూ.15 వేలు అకౌంట్లలో వేయాలి కదా? రైతుబంధును రైతు భరోసా అని పేరు మార్చి..డూప్లికేట్ మాటలు మాట్లాడుతున్నడు గుంపుమేస్త్రి అని ఆరోపించారు. ఇలా ఒక్కసారి కాదు. నిజం కడపదాటేలోగా అ బద్ధం ఊరంతా తిరిగి వస్తుందని పెద్దలు చెబుతారు. ఒ క్క అబద్ధాన్ని వందసార్లు చెబితే నిజం అవు తుందని అంటారు.

నూరు అబద్ధాలు చెప్పయినా లగ్గం చేయాలంటరు..దాన్ని నమ్ముకునే మోదీ ప్రధాని అయ్యారని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు’ అని అన్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నిన్న ఏం మాట మాట్లాడిండు.. రైతుబంధు పడలేదు అని ఎవడన్న అంటే..చెప్పుదీసి కొ డుతా అంటున్నాడు..ఇది మన గౌరవ మంత్రి కోమట్‌రెడ్డి మాట. మరి కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షుడు మల్లన్న ఇద్దరూ ఏమంటున్నరు.. రైతుబంధు పడలేదంటే చెప్పు దీసి కొడుతం అంటున్నరు, రాష్ట్రంలో ఉన్న 70 లక్షల మంది రైతులను అడుగుతున్నా ఎవరికైతే పడలేదో వారి ని ఆలోచించమని కోరుతున్నా.. వీళ్లను ఏ చెప్పుతో కొ ట్టాలి రైతుబంధు పడనోళ్లను ఆలోచించమని అడుగుతు న్న అన్నారు. చెప్పుతో కొడుతరా? ఓటుతో కొడుతరా? మీ ఇష్టం. కెసిఆర్ ఉన్నప్పుడు వారంలో ఏసిండు ఎట్ల.. రెండుమూడు నెలలైనా ఎందుకు వేస్తలేరు ఆలోచించమని కోరుతున్నానని కెటిఆర్ రైతులను కోరారు.

ప్రజలు కాంగ్రెస్‌ను ఓటుతో కొడతారు
రైతుబంధు వేయమంటే చెప్పుతోటి కొట్టమన్నందుకు రేపు కరీంనగర్ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓటుతో కొడుతరు’ అని కెటిఆర్ స్పష్టం చేశారు. రైతులు ఆల్రెడి మంట మీదున్నరు. క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇచ్చిం డా? ఏప్రిల్‌లో ఇస్తడా? ఇవ్వకపోతే రైతులు ఊరు కుం టరా..? చీరి చింతకు కట్టరు. క్వింటాల్‌కు రూ.500 బో నస్ మరిచిపోవద్దు. ఇచ్చి తీరాలి అన్నారు. ఇవ్వకపోతే వాళ్ల తరఫున మనమే గర్జించాలి. రూ.2 లక్షల రుణమా ఫీ అన్నాడు..పోయి రుణం తెచ్చుకొండి నేను సంతకం పెడుతా అన్నాడు, డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పో యింది, ఫిబ్రవరి 9 వస్తుంది, మరి చేస్తడా? చేయ చేతకా దు, ఎందుకంటే గుంపుమేస్త్రికి పని చేసిన తెలివి లేదు అ ని విమర్శించారు. కేసీఆర్‌పై బూతుపురాణం ప్రయోగించుకుంటూ తిరుగాడు తప్ప మరి ఏమిలేదని అన్నారు.

జరిగిన ఎన్నికల్లో బాధపడేంత ఓటమి కాదు..!
మొన్నటి ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు తగిలిన దెబ్బ చిన్నదేనని, 119 నియోజకవర్గాల్లో మనం పోటీ చేస్తే మనల్ని ప్రజలు చీకొట్టలేదని అన్నారు. తీసి అవతలపడేయలేదు. 39 సీట్లు ప్రజలు ఇచ్చారు. మూడోవంతు సీట్లు ఇచ్చారని పేర్కొన్నారు. 14 నియోజకవర్గాల్లో స్వల్ప తేడాతో ఓ డిపోయాం.జుక్కల్‌లో 1152 ఓట్లు, దేవరకద్రలో 1382 ఓట్లు, సిర్పూర్‌లో 3వేల ఓట్లు, బోధన్ లో 3 వేల ఓట్లు, ఖానాపూర్‌లో 4289 ఓట్లు తేడా. కొన్ని ఓట్ల తేడాతోనే కొన్ని సీట్లు కోల్పోయాం. ఈ 14 సీట్లలో ఆరేడు సీట్లు మ నం గెలిచినా.. ఇవాళ ఏం ఉంటుండెనో పరిస్థితి మాకే నాకంటే బాగా తెలుసు’నని అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎవరు ఎట్ల గెలిచారో ఆలోచన చేయాలన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను వీడి యో ప్లే చేయించి చూపించారు. రుణమాఫీ, పింఛన్లు, రైతుబంధు, కరెంటు బిల్లులపై చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియా వారియర్స్‌కు స్క్రీన్‌పై ప్రదర్శించారు.

ఓడిపోతే కుంగిపోవద్దు..
తెలంగాణ ప్రజల మనసు మళ్లీ తిరిగి ఎట్ల గెలుచుకుందాం.. లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ ఎట్లా జెండా పాతు దాం.. మళ్లీ ఎట్ల గులాబీ జెండా ఎగురవేద్దామనే దిశగా ఆలోచిద్దాం.. పొరపాటున కూడా ప్రజలను నిందించే విధంగా, ప్రజల తీర్పును అవమానించేలా మాట్లాడొద్దు అని సూచించారు. గెలుపుతోని పొంగిపోవద్దు.. ఓడిపోతే కుంగిపోవద్దని మన నాయకుడు కేసీఆర్ చెబుతారు అని గుర్తు చేశారు. దీనిని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపి వినోద్ కుమార్, బిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జివి రామకృష్ణా రావులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News