మన తెలంగాణ/హైదరాబాద్: హైడ్రా కూల్చివేతలపై త్వరలోనే హైదరాబాద్ ఎ మ్మెల్యేలతో మాట్లాడతామని బీఆర్‌ఎస్ కా ర్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. పెద్దలు, సీఎం సోదరులను వదిలి పెడతున్నారని, పేదల ఇండ్లను మాత్రం బుల్డోజర్లతో కూలుస్తున్నారని ధ్వజమెత్తా రు. హైడ్రా కూల్చివేతలపై త్వరలోనే నగర ఎమ్మెల్యేలతో కూర్చొని మాట్లాడతామని కే టీఆర్ తెలిపారు. బాధితులకు తమ హ యాంలో కట్టిన డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో నిర్మించిన ఎస్టీపీల పరిశీలనలో భాగంగా కేటీఆర్, బీఆర్‌ఎస్ ఎ మ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు బుధవారం ఫతేనగర్ మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని ప రిశీలించారు. ఆ తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ప్రభు త్వం ఉద్దేశం మంచిదే అని, తొలగించాలనుకుంటే ప్రత్యామ్నాయ పరిష్కారం చూ పించాలంటూ కేటీఆర్ కోరారు.
మూడు రోజుల కింద ఒక శాఖ రిజిస్ట్రేషన్ చేస్తుం టే మూడు రోజుల తర్వాత ఇంకో శాఖ ఇంటిని కూలగొడుతుందని తీవ్రంగా మం డిపడ్డారు. ఎస్టీపీల నిర్మాణం పూర్తయి వం ద శాతం శుద్ధి చేసే ఏకైక నగరంగా నిలుస్తుందని చాలా సంతోషంగా ఉందన్న కేటీఆర్, ఎస్టీపీల సందర్శనలో మొదటి అడు గు మాత్రమేనని, అన్ని ఎస్టీపీలను సందర్శిస్తామని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం కేసీఆర్ పడిన తపనను ప్రజలకు మళ్లీ గుర్తు చేస్తామని కేటీఆర్ చెప్పారు. మురుగునీరు శుద్ధి అయిన తర్వాత 94 శాతం మూసీలోకి పోతుందని చెప్పారు. ప్రభుత్వం డబ్బులిస్తే మొత్తం ఎస్టీపీలు పూ ర్తవుతాయని, రూ.4000 కోట్లతో మొత్తం శుద్ధి అవుతుంటే ఈ ప్రభుత్వం మూసీ కో సం ఏకంగా రూ. లక్షా 50 వేల కోట్లు అం టోందని పేర్కొన్నారు. తమకు అనుమానా లు కలుగుతున్నాయని, మూసీ త్వరలోనే బయటపెడతామని తెలిపారు. పాకిస్థాన్ కంపెనీలకు పనులు కట్టబెడుతున్నారని ఆరోపించారు.
ఆరు గ్యారంటీలు అమలు చేయాలి
కేసీఆర్ వడ్డించిన విస్తరిలో ప్రభుత్వానికి పంచభక్ష పరమాన్నాలు సిద్ధంగా ఉన్నాయని కేటీఆర్ అన్నారు. ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టలేదన్నారని, మూసీలో ఉ న్న వారికి ప్రత్యామ్నాయంగా డబుల్ రూ మ్‌లు ఇస్తామని ఇవాళ అంటున్నారని ఎ ద్దేవా చేశారు. ముఖ్యమంత్రి పబ్లిసిటీ స్టం టులు మానాలని, ఆరు గ్యారంటీలు వెంట నే అమలు చేయాలని డిమాండ్ చేశారు. చిట్టి నాయుడు వాళ్ల అన్నదమ్ములు రాష్ట్రా న్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. మంత్రులు ఎక్కడికక్కడ దోపిడీలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ మీ ద తాము పోరాటం చేస్తుంటే బీజేపీ ఎం పీలు వాళ్లకు రక్షణ కవచంగా వస్తున్నారని ఆక్షేపించారు. స్టేషన్‌ఘన్‌పూర్ ఉపఎన్నికకు రాజయ్య అభ్యర్థి అని ఇప్పటికే కేసీఆర్ ప్రకటించారని గుర్తుచేశారు.
నల్గొండ నేతలతో భేటీ
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మంత్రుల అరాచకాలను ఎండగడతామని కేటీ ఆర్ అన్నారు. అధికార అహంకారంతో ఈ జిల్లా మంత్రులు విచ్చలవిడిగా అ వినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డా రు. ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి నివాసంలో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సంద ర్భంగా జిల్లాలో పార్టీని బలోపేతం చే సేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వి స్తృతంగా చర్చించారు. ఈ సంద ర్భం గా పార్టీ చేపట్టనున్న అంశాలు, కార్య క్రమాలను పార్టీ నేతలకు కేటీఆర్ వివరించి, పార్టీని ముందుకు తీసుకెళ్లా ల్సిన అం శాలపై దిశా నిర్దేశం చేశారు. సమావేశంలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డితో పాటు నల్గొండ జిల్లా పరిధిలోని నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, పార్టీ సీనియర్ నాయ కులు పాల్గొన్నారు.