Sunday, December 22, 2024

కవితతో కెటిఆర్ భేటీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : సిబిఐ అదుపులో ఉన్న తన సోదరి, ఎంఎల్‌సి కవితతో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ సమావేశమయ్యారు. ఆదివారం ఢిల్లీలోని సిబిఐ ప్రధాన కార్యాలయానికి వెళ్లి కస్టడీలో ఉన్న కవితతో కెటిఆర్ భేటీ అయ్యారు. కెటిఆర్ వెంట కవిత భర్త అనిల్ కుమార్, న్యాయవాది మోహిత్ రావు ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి న్యాయపరంగా ఎలా ముందుకు సాగాలనే దానిపై చర్చించినట్లు సమాచారం.

పార్లమెంట్ ఎన్నికలతో బిజీ బిజీగా ఉన్న కెటిఆర్..ఢిల్లీకి వెళ్లి సోదరి కవితతో సమావేశమై పలు అంశాలు చర్చించారు. ప్రతి రోజు ఒక గంట పాటు కవితను కుటుంబ సభ్యులు కలిసేందుకు కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. ఢిల్లీ మద్యం కేసులో ఇప్పటికే అరెస్ట్ అయి, ప్రస్తుతం సిబిఐ అధికారుల బృందంలో మహిళా అధికారుల ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. ఎంఎల్‌సి కవిత సిబిఐ కస్టడీ సోమవారంతో ముగియనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News