Sunday, December 22, 2024

తిహార్ జైలులో కవితతో కెటిఆర్ ములాఖత్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీలోని తిహార్ జైలులో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, తన సోదరి ఎంఎల్‌సి కవితతో ములాఖత్ అయ్యారు. ఆమెను కలిసిన తర్వాత కెటిఆర్ హైదరాబాద్‌కు తిరుగు పయనం అయ్యారు. ఢిల్లీ మద్యం కేసులో కవితకు జ్యుడీషియల్ రిమాండ్‌ను రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించిన విషయం తెలిసిందే. సిబిఐ నమోదు చేసిన కేసులో ఈ నెల 21 వరకు కవితకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. మద్యం కేసులో కవిత పాత్రపై సిబిఐ సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేయగా, పరిగణనలోకి తీసుకునే అంశంపై విచారణను జులై 6న చేపడతామని స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News