Sunday, December 22, 2024

మళ్లీ వచ్చేది మా ప్రభుత్వమే.. జాగ్రత్త: కేటీఆర్ వార్నింగ్

- Advertisement -
- Advertisement -

అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అచ్చంపేట ఎమ్మెల్యే బాలరాజును మంత్రి కేటీఆర్ పరామర్శించారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల పరస్పర దాడిలో ఎమ్మెల్యే గువ్వవల బాలరాజుకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కేటీఆర్.. అపోలో ఆస్పత్రికి వెళ్లి బాలరాజును కలిసి పరామర్శించి, ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అచ్చంపేటలో గువ్వల బాలరాజుపై దాడి ఖండిస్తున్నానని అన్నారు. మొన్న కొత్త ప్రభాకర్‌ రెడ్డిపై కత్తితో దాడి చేశారని.. ఇవాళ గువ్వల బాలరాజుపై రాళ్లతో దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలవాలంటే ప్రజలను మెప్పించాలి… అంతేకానీ కత్తిపోట్లు, రాళ్ల దాడులు మంచిది కాదన్నారు ఎన్నికల తర్వాత మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని.. దాడుల సంస్కృతిని ప్రోత్సహిస్తే నష్టపోయేది మీరే అని అన్నారు. మళ్లీ ఇంతకింత అనుభవించాల్సి వస్తుంది.. జాగ్రత్త అని హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత పోలీసులదేనని.. గువ్వల బాలరాజుకు భద్రత పెంచాలని డీజిపిని కోరుతున్నానని కేటీఆర్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News