Monday, January 20, 2025

కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసి.. పోలీసులే దాడి చేయించారు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి ఘటనలో పోలీసుల తీరుపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే కెటిఆర్ మండిపడ్డారు. పోలీసులే దగ్గరుండి నిందితులో దాడి చేయించారన్నారు. శనివారం ఉదయం అమెరికా పర్యటన ముగించుకుని నుంచి హైదరాబాద్ చేరుకున్న కెటిఆర్.. కొండాపూర్ లోని కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్లి పరామర్శించారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన కెటిఆర్.. “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బిఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లకు తిరిగి కాంగ్రెస్ కండువా కప్పారు. కౌశిక్ రెడ్డి ఇంటిపై గుండాలతో దాడి చేశారు. కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని ఎస్కార్ట్ తో తీసుకువచ్చి పోలీసులే దాడి చేయించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు తప్పదు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రశాంతంగా ఉన్నాం. కాంగ్రెస్ పాలనలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పింది” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News