Saturday, November 23, 2024

కొడంగల్ నీ సామ్రాజ్యమా.. నువ్వేమైనా చక్రవర్తివా:కెటిఆర్

- Advertisement -
- Advertisement -

‘కొండల్ నీ సామ్రాజ్యమా ..రేవంత్‌రెడ్డి నీవేమైనా చక్రవర్తివా.. నీలాంటి నియంతలు ఎంతోమంది కొట్టుకుపోయారు..నువ్వు కూడా కొట్టుకుపోతావ్’ అని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వ్యాఖ్యానించారు. వికారాబాద్ కలెక్టర్‌పై దాడి కేసులో అరెస్టయి చర్లపల్లి సెంట్రల్ జైల్లో ఉన్న కొడంగల్ మాజీ ఎంఎల్‌ఎ పట్నం నరేందర్‌రెడ్డిని శనివారం ఉదయం మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మరెడ్డి, మహ్మద్ అలీ, ఎంఎల్‌ఎలు బండారి లకా్ష్మరెడ్డి, కోవ లక్ష్మితో కలిసి ములాఖాత్‌లో ఆయన కలిశారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. పట్నం నరేందర్‌రెడ్డికి లగచర్ల కుట్ర కేసుతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించి 30 మంది అమాయక రైతులను జైల్లో పెట్టారని మండిపడ్డారు. సిఎం సొంత గ్రామం కొండరెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ..రేవంత్‌రెడ్డి గెలుపు కోసం పని చేస్తే ఆయన ఇంటికే దారి లేకుండా చేశారని ధ్వజమెత్తారు. నియంతలు, దుర్మార్గుల పాలనలోనే ఇలాంటి సంఘటనలు జరుగతాయని వ్యాఖ్యానించారు. తాము అధికారంలో ఉన్న పదేళ్లలో ఎలాంటి దాడులు జరగలేదని అన్నారు.

రాష్ట్రంలో విద్యార్థులు, రైతులు, పోలీసులు ఇలా ఎక్కడ నిరసనలు జరిగిన బిఆర్‌ఎస్ చేయిస్తోదని మాట్లాడుతున్నారని, ప్రతిపక్షంగా ప్రజలకు మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. జైల్లో నరేందర్‌రెడ్డి ధైర్యంగా ఉన్నారని.. అన్యాయంగా జైల్లో ఉన్న గిరిజన రైతులను కాపాడాలని కోరినట్టు తెలిపారు. నరేందర్‌రెడ్డితో పాటు రైతులకు తమ పార్టీ పూర్తి అండగా ఉంటుందని.. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, మీ వెనక మాజీ సిఎం కెసిఆర్ ఉన్నారని భరోసా ఇచ్చారు. అన్యాయంగా కుట్ర కేసు పెట్టిన నరేందర్‌రెడ్డితో పాటు గిరిజన రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం, న్యాయస్థానాలపై నమ్మకం ఉందని, నరేందర్‌రెడ్డి నిర్దోషిగా బయటకు వస్తారని దీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జైలు వద్దకు పలువురు మాజీ ఎంఎల్‌ఎలు, స్థానిక నాయకులు పెద్ద ఎత్తున చేరుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News