Monday, January 20, 2025

కెటిఆర్ తక్షణమే రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలి:బల్మూరి వెంకట్

- Advertisement -
- Advertisement -

మీరు అధికారం కోసం ఎంత ఆకలితో ఉన్నారో తెలంగాణ మొత్తానికి తెలుసని, తక్షణమే రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డికి ఏ నోటీసులు రాలేదని రాజకీయాల కోసం ఇదంతా చేస్తున్నారని మాజీ మంత్రి కెటిఆర్ చేసిన ఆరోపణలపై ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫైర్ అయ్యారు. అందుకు సంబంధించిన ఆధారాలు చూపెడుతూ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ట్విట్టర్ వేదికగా కెటిఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రియమైన కెటిఆర్ దయచేసి కింద చూడండి, సిఎం రేవంత్ రెడ్డికి నోటీసులు

ఇచ్చినట్లు రాసిన పేపర్ క్లిప్ మీకు కనిపిస్తుందా అని ఆయన సూచించారు. అబద్ధాలను ఉమ్మివేసి, నకిలీ సమాచారాన్ని వ్యాప్తి చేసే ముందు, ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కెటిఆర్ సూచించారు. అధికారం కోసం అంత ఆరాటపడకండి. మీరు అధికారం కోసం ఎంత ఆకలితో ఉన్నారో తెలంగాణ మొత్తానికి తెలుసని, తనపై తప్పుడు ప్రచారం చేసినందుకు మా ముఖ్యమంత్రికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నామని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఎక్స్‌లో రాసుకొచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News