Monday, January 20, 2025

కెటిఆర్ పేరు నేను చెప్పలేదు

- Advertisement -
- Advertisement -

వారే రాసుకొని సంతకం పెట్టించుకున్నారు
పోలీసులు నా దగ్గరి నుంచి ఎలాంటి
స్టేట్‌మెంట్ తీసుకోలేదు అరెస్టుకు
ముందు నోటీసులు ఇవ్వలేదు…
లగచర్ల దాడి కేసులో అక్రమంగా
ఇరికించారు కోర్టుకు సమర్పించిన
అఫిడవిట్‌లో కొడంగల్ మాజీ ఎంఎల్‌ఎ
పట్నం నరేందర్‌రెడ్డి హైకోర్టులో క్వాష్
పిటిషన్ దాఖలు వికారాబాద్ కోర్టులో
బెయిల్ పిటిషన్ ఏడు రోజుల కస్టడీ
కోరుతూ పోలీసుల పిటిషన్

మన తెలంగాణ/హైదరాబాద్ : తన పేరుతో పోలీసులు ఇ చ్చిన కన్ఫెషన్ రిపోర్ట్ తప్పు అని, కెటిఆర్ గురించి గానీ కే సు గురించి గానీ పోలీసులకు తానేమీ చెప్పలేదని బిఆర్‌ఎ స్ నేత, మాజీ ఎంఎల్‌ఎ పట్నం నరేందర్‌రెడ్డి చర్లపల్లి జైలు నుంచి అఫిడవిట్ ఇచ్చారు. పోలీసులు తన నుంచి అసలు ఏ స్టేట్‌మెంట్ తీసుకోలేదని, రిమాండ్ రిపోర్ట్‌లో ఏముందో తనకు తెలియదని చెప్పారు. కోర్టుకు వచ్చాక తన అడ్వకేట్ కోరితే రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారని పేర్కొన్నారు. లగచర్ల దా డి కేసులో పోలీసుల రిమాండ్ రిపోర్ట్‌పై ఆయన స్పందిస్తూ తాను ఎవరి పేరు చెప్పలేదు అని, పోలీసులు చెప్పనిది చె ప్పినట్లు రాశారని పేర్కొన్నారు. కెటిఆర్ ప్రోద్బలంతోనే లగిచెర్ల దాడులు జరిగాయని తాను ఎక్కడ ఎలాంటి స్టేట్మెంట్ పోలీసులకు ఇవ్వలేదని అన్నారు. మరోవైపు.. లగచర్ల ఘటనలో ఎ1గా ఉన్న పట్నం

నరేందర్ రెడ్డిని బుధవారం కొడంగల్ కోర్టులో హాజరుపర్చగా.. న్యాయస్థానం 14 రో జుల రిమాండ్ విధించింది. దీంతో నరేందర్ రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించారు. దీంతో ఈనెల 27 వరకు ఆయన జై లులోనే ఉండనున్నారు. లగచర్లలో ప్రభుత్వాధికారులపై దాడి కేసులో అరెస్టైన మాజీ ఎంఎల్‌ఎ పట్నం నరేందర్‌రెడ్డి తనపై నమోదైన కేసును కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో గురువారం క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.చర్లపల్లిలో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనను న్యాయవాదులు కలిశారు.తనను అక్రమంగా ఈ కేసులో ఇరికించారని, అరెస్టు కి ముందు నాకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని పేర్కొన్నా రు. బొమరాస్‌పేట్ స్టేషన్‌లో నమోదైన కేసుతో తనకు ఎ లాంటి సంబంధం లేదని పట్నం నరేందర్‌రెడ్డి తెలిపారు.

టి ఐఐసీ కోసం భూమి కోల్పోయే బాధితులే అధికారులపై దా డి చేశారని చెప్పారు. ఈ విషయాన్ని సరిగా పరిశీలించకుండానే కిందికోర్టు తనను రిమాండ్‌కు పంపిందని అన్నారు. ఈ ఘటనతో తనకు సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు పోలీసులు సమర్పించలేదని స్పష్టం చేశారు. రిమాండ్ డైరీలో పేర్కొన్నట్లు అరెస్టును సమర్థించే కారణాలు తెలపలేదని అన్నారు. అరెస్టు అక్రమం, రాజకీయ ప్రేరేపితమన్న విషయాన్ని కిందికోర్టు గ్రహించలేదని పేర్కొన్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుని రిమాండ్ ఉత్తర్వులను కొట్టివేయాలని పట్నం నరేందర్‌రెడ్డి హైకోర్టుకు విన్నవించారు.బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నరేందర్ రెడ్డి : ఫోన్ కాల్ డేటాని విశ్లేషించేందుకు, నరేందర్ రెడ్డిని కేసుపై మరింత విచారిచేందుకు అతన్ని కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. ఆయనను ఏడు రోజుల కస్టడీకి కోరుతూ వికారాబాద్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు వికారాబాద్ కోర్టులో పట్నం నరేందర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై కోర్టు సోమవారం విచారణ జరపనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News