- Advertisement -
ఫార్ములా ఈ కారు రేసు కేసులో విచారణకు మాజీ మంత్రి కెటిఆర్ డుమ్మా కొట్టారు. సోమవారం ఉదయం విచారణకు హాజరయ్యేందుకు తన లాయత్ కలిసి కెటిఆర్ బంజారాహిల్స్ ఏసిబి కార్యాలయానికి వచ్చారు. అయితే, పోలీసులు లాయర్ ను విచారణకు అనుమతించమని అడ్డుకున్నారు. దీంతో తన లాయర్ ను ఎందుకు అనుమతించరని కెటిఆర్ పోలీసులను ప్రశ్నించారు.
దాదాపు 40 నిమిషాల పాటు పోలీసులు, కేటీఆర్ టీమ్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. లాయర్‌ను అనుమతించాలని కోర్టు ఉత్తర్వుల్లో లేదని పోలీసులు చెప్పగా.. లాయర్‌ను అనుమతించకూడదన్న నిబంధన చూపాలని కెటిఆర్ పట్టుబట్టారు. తన లాయర్ ను అనుమతిస్తేనే విచారణకు హాజరవుతానని అన్నారు. అయినా.. పోలీసులు అనుమతించకపోవడంతో.. విచారణకు హాజరుకాకుండానే ఏసిబి ఆఫీస్ నుంచి కెటిఆర్ తిరిగి వెళ్లిపోయారు.
- Advertisement -