Monday, March 3, 2025

నీళ్లు పాతాళానికి.. నిధులు ఢిల్లీకి నియామకాలు గాలికి

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వంపై కెటిఆర్
విసుర్లు అధికారంలోకి వచ్చాక
ఆరువేల ఉద్యోగాలు కూడా
ఇవ్వలేదు కెసిఆర్ హయాంలోనే
ఆ మూడు నినాదాలకు న్యాయం
చేశాం మైక్‌లో చెప్పడానికి
రేవంత్ చేసిన మంచి పని
ఏముంది? చెడు చెప్పుకుంటూ
పోతే చెవుల్లోంచి రక్తాలు
కారతాయని వ్యాఖ్యలు’

మన తెలంగాణ / హైదరాబాద్ : అసెంబ్లీ ఎ న్నికల సమయంలో రాహుల్ గాంధీ హైదరాబాద్ అశోక్ నగర్ వెళ్లి ఏడాదికి 2 లక్షల ఉ ద్యోగాలు ఇస్తామని చెప్పారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు దాటినా ఆరువేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించా రు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కే టీఆర్ సమక్షంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు నాయకులు పార్టీలో చేరారు. కేటీఆర్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో నీళ్లు పాతాళానికి, నిధులు ఢిల్లీకి, నియామకాలు గాలికి పోయాయాని ఎ ద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమం సమయం లో నీళ్లు, నిధులు, నియామకాల గురించి మా ట్లాడుకున్నామని, వాటి సాధన కోసం కేసీఆర్ ఎంతో కృషి చేశారని అన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో ఇంటింటికి నీళ్లు తెచ్చుకున్నామ ని, సాగునీటిని ఇచ్చి వ్యవసాయ విస్తరణ పెం చడం ద్వారా పంట దిగుబడి పెంచామని, లక్షలాది ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాలకు కేసీఆర్ సంపూర్ణ న్యాయం చేశారని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ మీద కోపంతో సాగునీరు ఇవ్వకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు. ఏడాదికి లక్ష ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారని ధ్వజమెత్తారు.

ఉప ఎన్నికలు రాబోతున్నయ్ : అతి త్వరలో రాష్ట్రంలో ఉప ఎన్నికలు రాబోతున్నాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జోస్యం చెప్పారు. దీనికి బీఆర్‌ఎస్ శ్రేణులంతా సిద్ధంగా ఉండాలని సూచించారు. మంచి మైక్ లో చెప్పాలి..చెడు చెవిలో చెప్పాలి అని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని, మంచి చెప్పడానికి రేవంత్ రెడ్డి చేసిన ఒక్క మంచి పని లేదన్నారు. రేవంత్ రెడ్డి చేసిన చెడు చెబితే చెవిలో రక్తాలు కారుతాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చి 15 నెలలు దాటినా చెప్పుకోవడానికి ఒక్క మంచి పని కూడా లేదంటే ప్రజలే అర్థం చేసుకోవాలన్నారు. అన్ని వర్గాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేధిస్తోందని, మహిళలు, విద్యార్థులు, రైతులు, నిరుద్యోగులు ఇలా చెప్పుకుంటూ పోతే అందరినీ ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు.

కాంగ్రెస్ పాలనలో విధ్వంసం : బ్యాగులు మోసి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ని పక్కన పెట్టుకొని బ్యాగులు మోయొద్దని కాంగ్రెస్ కొత్త ఇన్చార్జి మీనాక్షి మాట్లాడడం విడ్డూరంగా ఉందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అప్పట్లో చంద్రబాబుకు బ్యాగులు మోస్తే, ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానానికి రేవంత్ రెడ్డి బ్యాగులు మోస్తున్నాడని ఆరోపించారు. హైడ్రా విధ్వంసం, ఆర్‌ఆర్ టాక్స్ భూకబ్జాలు, అంతులేని అవినీతితో కుప్పకూలిన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్, మొన్ననే కొట్టుకుపోయిన పెద్దవాగు, మునిగిన వట్టెం పంప్ హౌస్ ఇలా చెప్పడం మొదలుపెడితే రేవంత్ చెవుల నుంచి రక్తం కారుతుందన్నారు. కేసీఆర్ హయాంలో ప్రశాంతంగా ఉన్న తెలంగాణ, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో విధ్వంసం, అరాచకాలతో కుప్పకూలిందన్నారు. హైడ్రా, మూసీ కూల్చివేతలతో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని దెబ్బతీశారని, మేడ్చల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమని కేటీఆర్ అన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో 90శాతం పనులు పూర్తయ్యాయని, కేవలం 10శాతం పనులు చేస్తే చేవెళ్లకు నీళ్లు వస్తాయని, కానీ రేవంత్ రెడ్డి అలా చేయడం లేదన్నారు.

ఆ పని జరగాలంటే తిరిగి కేసీఆర్ సిఎం కావాలి : కేసీఆర్‌కు పేరు వస్తుందన్న అసూయతో ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని, మూసీ సుందరీకరణ కోసం రూ.1,50,000 కోట్లు ఖర్చు చేసి కమీషన్లు దండుకుని, కాంగ్రెస్ అధిష్ఠానానికి పంపి తన పదవి కాపాడుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ నాయకత్వంలో ’నీళ్లు, నిధులు, నియామకాలు’ అన్న తెలంగాణ ఉద్యమ నినాదం సాకారమైందని, ఇంటింటికి మంచినీళ్లు, పొలాలకు సాగునీరు తెచ్చామన్నారు. కాళేశ్వరం తో పాటు మిగతా సాగునీటి పథకాలతో వరి ఉత్పత్తిలో దేశంలో నంబర్ వన్‌గా తెలంగాణ నిలిచిందని, పదేళ్లలో తలసరి ఆదాయంలో భారతదేశంలోనే అగ్రస్థానంలో నిలిపామన్నారు. రైతుబంధు, రుణమాఫీ ద్వారా లక్ష కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని, రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, 24 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు సృష్టించామని కేటీఆర్ గుర్తు చేశారు. కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అయితేనే తెలంగాణ మరోసారి దేశంలో నెంబర్ రాష్ట్రంగా నిలుస్తుందని, గెలుస్తుందని కేటీఆర్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News