Tuesday, January 21, 2025

అణాపైసా అవినీతి లేదు

- Advertisement -
- Advertisement -

ఫార్ములా ఈ-రేస్‌పై మంత్రి పొన్నం ప్రకటనే
ఇందుకు నిదర్శనం ఈ వ్యవహారంలో
ప్రొసీజర్ సరిగ్గా లేదని పొన్నం చెప్పారు
హెచ్‌ఎండిఎ స్వతంత్ర సంస్థ.. ప్రతి
కార్యక్రమానికి ప్రభుత్వ అనుమతి అవసరం
లేదు నాపై పెట్టిన కేసు నిలబడదు
ఓఆర్‌ఆర్‌ను టివోటి తరహాలో లీజుకిచ్చాం
కేబినెట్ సబ్ కమిటీ సిఫారసుల మేరకే ఈ
నిర్ణయం: కెటిఆర్

టిఒటి తరహాలోనే ఓఆర్‌ఆర్ లీజు
ఆ డబ్బును రైతు రుణమాఫీకి
వినియోగించాం
అవినీతి జరిగితే లీజును సిఎం
ఎందుకు రద్దు చేయట్లేదు?
ప్రశ్నించిన బిఆర్‌ఎస్ వర్కింగ్
ప్రెసిడెంట్ కెటిఆర్
అసెంబ్లీ లాబీలో మీడియాతో
చిట్‌చాట్
మన తెలంగాణ/హైదరాబాద్: ఫార్ములా- ఈ రేస్ కేసులో అణాపైసా అవినీతి లేదని బిఆర్‌ఎస్ వ ర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాటలతో ఈ కేసులో అవినీతి లేదని తేలిందని స్పష్టం చేశారు. ప్రొసీజర్ కరెక్ట్‌గా లేదని మాత్రమే అన్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం కేసుపై ముందుకు వెళ్తే న్యాయపరంగా ఎదుర్కొంటామని అన్నారు. హెచ్‌ఎండిఎ ఒక కార్పోరేషన్ అని, హైదరాబాద్ నగర ప్రగతికి పనికి వచ్చే ఏ కార్యక్రమానికైనా డబ్బులు ఖర్చు చేయవచ్చని చెప్పారు. హెచ్‌ఎండిఎ చేసే ప్రతి పనికి ప్రభుత్వ అనుమతి అవసరం లేదని చట్టంలోనే ఉందని, దానికి ఆ మేరకు స్వతంత్రత ఉం దని వివరించారు. అసెంబ్లీ లాబీలో శుక్రవారం మీడియా ప్రతినిధులతో కెటిఆర్ ఇష్టాగోష్టిగా మా ట్లాడారు. ఫార్ములా -ఈ కార్ రేస్ కేసులో కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. సిఎంను ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారా లేదా ముఖ్యమంత్రే అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారో అర్ధం కావడంలేదని చెప్పారు. తనపై కేసు నిలబడదని స్పష్టం చేశారు. ఈ కేసు విషయంలో న్యాయపరంగా ముందుకు వెళ్తామని, లంచ్ మోషన్ పిటిషన్‌పై న్యాయస్థానం తేలుస్తుందని అన్నారు.

ఓఆర్‌ఆర్ లీజును ఎందుకు
రద్దుచేయట్లేదు..?
ఓఆర్‌ఆర్ లీజు అంశంలో సిట్ ఏర్పాటుపై కెటిఆర్ స్పందించారు. టిఒటి పద్ధతి దేశంలో ఇప్పటికే అమలులో ఉందని, ఔటర్ రింగ్ రోడ్డు లీజు డబ్బును రైతు రుణమాఫీకి ఉపయోగించామని కెటిఆర్ చెప్పారు. ఆర్థిక వనరుల సమీకరణపై అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ అనేక సూచనలు ఇచ్చిందని, ఓఆర్‌ఆర్ నుంచి డబ్బులు సేకరించవచ్చని సూచించిందని పేర్కొన్నారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఎఐ) జాతీయ రహదారులు నుంచి డబ్బులు సేకరిస్తున్న టిఒటి తరహాలోనే ఓఆర్‌ఆర్ లీజు నుంచి డబ్బులను సేకరించామని తెలిపారు. ప్రైవేట్ కంపెనీకి లబ్ధి చేకూర్చినట్టు ఆరోపిస్తున్న సిఎం రేవంత్ రెడ్డి ఆ కంపెనీతో లీజుని ఎందుకు రద్దు చేయడం లేదని ప్రశ్నించారు. గతంలో ఓఆర్‌ఆర్ లీజుపై రూ.లక్ష కోట్ల అవినీతి అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడిన అడ్డగోలు మాటలపై హెచ్‌ఎండిఏ పరువు నష్టం కేసు వేసిందని, ఇప్పటికీ ఆ కేసు అలాగే ఉందని అన్నారు. రేవంత్‌రెడ్డి ఓఆర్‌ఆర్‌పై అనేకసార్లు కుంభకోణం అని మాట్లాడారని, మరి ఆ లీజును ఎందుకు రద్దు చేయడం లేదని అడిగారు.

వాస్తవాలు ఎలా బయటకు వస్తాయ్..
సిఎం రేవంత్ రెడ్డి మున్సిపల్, హోంశాఖ మంత్రిగా ఉన్నారని, ఇలాంటి సందర్భంలో సిట్ ద్వారా తన పరిధిలో ఉన్న అధికారులతో వాస్తవాలు ఎలా బయటకు వస్తాయని కెటిఆర్ ప్రశ్నించారు. తన సొంత శాఖ అధికారులతో దర్యాప్తు చేస్తే నిజాలు ఎలా బయటకు వస్తాయో రేవంత్ చెప్పాలని డిమాండ్ చేశారు. అందుకే ఓఆర్‌ఆర్ లీజును వెంటనే రద్దుచేసి.. సిట్టింగ్ జడ్జితో కానీ రిటైర్డ్ జడ్జితో కానీ నిష్పాక్షిక విచారణ జరిపించాలని కోరారు. ఒకవేళ కుంభకోణం జరిగి ఉంటే ఆయాచితంగా లబ్ధి జరిగిన కంపెనీని కాంట్రాక్టు ఎందుకు రద్దు చేయడం లేదని నిలదీశారు. సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించకుంటే ఇది మరొక రాజకీయ కక్ష సాధింపు కేసు అని ప్రజలు అనుకుంటారని పేర్కొన్నారు.

న్యాయమూర్తి ఏర్పాటు చేసే బృందం జాతీయ రహదారుల సంస్థ విధానాలను అధ్యయనం చేయాలని కూడా సూచిస్తాస్తామని తెలిపారు. తమపై ఆరోపణలు చేసి కక్ష సాధింపుల కోసం మాత్రమే పరిమితం కాకుండా వాస్తవాలు తెలిసేలా మాట్లాడాలని సూచించారు. కోకాపేట భూములపై రూ.10 వేల కోట్ల కుంభకోణం అంటున్నారని, స్కామ్ అయితే ఆ భూముల అమ్మకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని పేర్కొన్నారు. ఎంఎల్‌ఎలకు స్పీకర్ శిక్షణ ఇచ్చారని, ప్రతిపక్ష సభ్యులపైకి వాటర్ బాటిళ్లు, పేపర్లు విసరడం ఎలా అని శిక్షణ ఇచ్చారా..? ప్రశ్నించారు. స్పీకర్ దళితుడు అంటూ పదే పదే చెప్పడం స్పీకర్ గౌరవాన్ని తగ్గించేలా చేయడమే అని కెటిఆర్ వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News