Wednesday, January 22, 2025

రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు అన్నారు. రేవంత్ ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలు, ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతోనే అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విమర్శించారు. రైతు ఆత్మహత్యలపై వేసిన తమ కమిటీ వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశ్యం లేదని, కేవలం రైతాంగానికి అండగా నిలబడాలన్న ఆలోచన తప్ప ఇంకేం లేదని స్పష్టం చేశారు. బుధవారం మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాసంలో సమావేశమైన అధ్యయన కమిటీ తొలి సమావేశం జరిగింది. అనంతరం కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ, ఆదిలాబాద్ బ్యాంకులో ఆత్మహత్య చేసుకున్న రైతు విషాద ఘటనే ఈ కమిటీ వేయడానికి కారణం అని పేర్కొన్నారు.

బిఆర్‌ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ ఆదేశం మేరకు ఏర్పాటైన ఈ కమిటీ శుక్రవారం(జనవరి 24) నుంచి పూర్వ ఆదిలాబాద్ జిల్లా నుంచి పని ప్రారంభిస్తుందన్నారు. రాబోయే నెల రోజులపాటు అన్ని జిల్లాలలో అన్ని వర్గాల రైతులను కలిసి రుణమాఫీ ఎంత మేరకు జరిగింది..? అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది..?..కరెంటు సరఫరా ఎలా ఉంది..?.. సాగు పరిస్థితి ఎలా ఉంది..? మద్దతు ధర దొరకుతుందా..? బోనస్ ఏమైంది..? కొనుగోలు కేంద్రాలు ఏమయ్యాయి..? రైతు వేదికలు పని చేస్తున్నాయా.. ? వంటి అంశాలను అధ్యయనం చేస్తుందని తెలిపారు. రైతాంగం ఎదుర్కుంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించడంతో పాటు ఆత్మహత్యలకు కారణాలను అధ్యయనం చేసి నివేదికను రూపొందిస్తుందని, ఆ నివేదికను బిఆర్‌ఎస్ అధ్యక్షుడు కెసిఆర్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తుందని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News