Saturday, January 4, 2025

ఈ కేసు.. లొట్టపీసు

- Advertisement -
- Advertisement -

ఎసిబి కేసు..ఇడి నోటీసును న్యాయపరంగా ఎదుర్కొంటా
నాపై కేసు పెడితే రేవంత్ మీద కూడా పెట్టాలి.. అవినీతే
లేనప్పుడు కేసు ఎక్కడిది ? అధికారం ఇవ్వకపోతే రెస్టు
తీసుకుంటానని కెసిఆర్ అప్పుడే చెప్పారు ప్రస్తుతం ఆయన
రెస్టులో ఉన్నారు ఏప్రిల్ 25న హైదరాబాద్‌లో భారీ
బహిరంగ సభ ఈ ఏడాది అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు
రావచ్చు మీడియాతో చిట్‌చాట్‌లో బిఆర్‌ఎస్ వర్కింగ్
ప్రెసిడెంట్ కెటిఆర్

మనతెలంగాణ/ హైదరాబాద్ : ఎసిబి కేసు, ఈడీ నోటీసును న్యాయపరంగా ఎదుర్కొంటామని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారా వు తెలిపారు. ఫార్ములా ఈ కేసు ఓ లొట్టపీసు కేసు అని అన్నారు. అసలు అవినీతే లేనప్పు డు కేసు ఎక్కడిదన్నారు. ఒప్పందం చేసుకున్నందుకు తనపై కేసు పెడితే రద్దు చేసిన రేవంత్ పైనా పెట్టాలని అన్నారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో చి ట్ చాట్ చేశారు. ఫార్ములా ఈ కేసులో పసే లేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు అన్నా రు. డ్రగ్స్, లగచర్ల..ఇప్పుడు కార్ రేస్ కేసు అం టున్నారని, ఎన్ని కేసులు పెట్టినా భయపడబోనని కెటిఆర్ చెప్పారు. హైదరాబాద్ ఇమే జ్ కోసం ఈ రేస్ లో డబ్బులు పంపుమన్న మంత్రిగా విధానపరమైన నిర్ణయం తీసుకున్నానని వివరించారు. అధికారులు ఫైల్స్ చూస్తారు..నాకేం సంబంధం. ఇప్పుడు సిఎం ఫార్ములా ఈ రేస్ ను రద్దు చేశారని, కేబినెట్ లో నిర్ణయం

తీసుకునే చేశారా..? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి కారణంగా 600 కోట్లు నష్టం జరిగింది. నా మీద కేసు పెడితే ఆయన మీద కూడా పెట్టాలె కదా..? ఫార్ములా ఈ కేసులో అవినీతే లేనప్పడు కేసు ఎక్కడిది..? తమకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉందని కెటిఆర్ అన్నారు. ఫార్ములా-ఈ రేసు..ఎసిబి పెట్టిన అవినీతి లేని మొదటి కేసు అని అన్నారు. ఫార్ములా-ఈ రేసుకు పురపాలక శాఖ మంత్రిగా నేను అనుమతిస్తే రేవంత్‌రెడ్డి రద్దు చేశారు. నేను తప్పు చేస్తే రేవంత్‌రెడ్డిది ఎలా ఒప్పు అవుతుంది? ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై త్వరలో సుప్రీంకోర్టుకు వెళ్తాం. ఫార్ములా- ఈ కేసులో కోర్టు అడిగే ప్రశ్నలకు ఎజి దగ్గర సమాధానం లేదు. ఈ ఏడాది ఉపఎన్నికలు రావొచ్చు. ట్రిపుల్ ఆర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.12వేల కోట్లు నష్టం చేస్తోంది. ఖాజాగూడలో ఉన్న భూములపై కన్నేసి పేదలను రోడ్డుపాలు చేశారు. రూ.1.38 లక్షల కోట్లు అప్పు చేసి ఢిల్లీకి రూ.వేల కోట్లు పంపుతున్నారని ఆరోపించారు. సంక్రాంతికి దిల్ రాజువి రెండు సినిమాలు ఉన్నాయని, ఆయన బాధ ఆయనదన్నారు.
అధికారం ఇవ్వకపోతే రెస్టు తీసుకుంటానన్నారు :
ఎప్పుడు బయటికి రావాలో కెసిఆర్‌కు తెలుసు..ఆయన మా ట్రంప్ కార్డు.. మీరు అధికారం ఇవ్వకపోతే రెస్టు తీసుకుంటానని ఎలక్షన్ల టైంలోనే చెప్పారని, అధికారం ఇవ్వలేదు..అందుకే రెస్టు తీసుకుంటున్నారని, ఇక్కడ సమస్య కెసిఆర్ గురించి కాదు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీల గురించి…మీరిచ్చిన హామీలను ముందు అమలు చేయాలని కోరారు. పార్టీ మారిన బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టుకు వెళ్లబోతున్నామని, త్వరలోనే ఆ సెగ్మెంట్లో ఉప ఎన్నికలు జరుగుతాయని కెటిఆర్ చెప్పారు. బిఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం రోజైన ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నామని చెప్పారు.

అక్టోబర్ లో బిఆర్‌ఎస్ అధ్యక్ష ఎన్నిక :

ఏడాది మొదటి హాఫ్ లో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. తర్వాత గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు వేస్తామని తెలిపారు. పార్టీ అధ్యక్షుడి ఎన్నికకు వచ్చే అక్టోబర్ వరకు సమయముందని అన్నారు. పార్టీ నేతలకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్‌ఎస్ సత్తా చూపిస్తామని చెప్పారు. బిసిలకు 42శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేదని, ప్రభుత్వమే కోర్టుల్లో కేసులు వేయించబోతోందన్నారు. బిసిలను మోసం చేసే ఈ ప్రభుత్వాన్ని వెంటాడుతామని కెటిఆర్ అన్నారు. రీజినల్ రింగ్ రోడ్డులో 12 వేల కోట్లను కొట్టేసేందుకు ప్లాన్ జరుగుతోందని, ఇందులో మంత్రి కోమటిరెడ్డి ఉన్నారన్నారు. ఈ యేడాది కాలంలో రేవంత్ రెడ్డి చేసిన లక్షా 37 వేల కోట్లు అప్పుల్లో ఢిల్లీకి చాలా డబ్బులు పోయాయని ఆరోపించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతాం :

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి సత్తా చాటుతుందని కెటిఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఆలోచన రేవంత్ రెడ్డి సర్కారుకు లేదన్నారు. అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక బద్దంగా ఒక కుట్రకు తెర లేపిందని, ఈ కుట్రలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం మొన్న శాసనసభలో చేసిన స్థానిక సంస్థల చట్ట సవరణలలో బిసిలకు మరింత రిజర్వేషన్లను అందచేసేందుకు సుప్రీంకోర్టు కేసు ప్రస్తావనతో పాటు, త్రిపుల్ టెస్ట్, ప్రత్యేక బిసి కమిషన్ సిఫార్సుల నివేదిక వంటి కారణాలను ప్రస్తావించిందని కెటిఆర్ వివరించారు. వీటిని అడ్డుపెట్టుకుని ఎవరితోనో ఒకరితో కోర్టులో కేసు వేయించి స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని కెటిఆర్ ఆరోపించారు.

రైతులకు సెల్ఫ్ డిక్లరేషన్ ఎందుకు :

రాష్ట్ర సర్కారు ప్రస్తుతం ఆలోచిస్తున్న రైతు భరోసా కార్యక్రమానికి విధించనున్న కోతలతో రాష్ట్ర రైతాంగంలో తిరుగుబాటు వస్తుందని కెటిఆర్ అన్నారు. రైతులను మోసగించే ఏకైక ఉద్దేశంతోనే రైతు భరోసాను కుదించే ప్రయత్నం చేస్తుందన్నారు. గతంలో ఎక్కడా లేని విధంగా పంట పొలాల సాగు అంశంలో సెల్ఫ్ డిక్లరేషన్ అంశాన్ని రైతులపై రుద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. 14.50 లక్షల కోట్ల రూపాయల అప్పులను బ్యాంకులు మాఫీ చేసినప్పుడు లేని సెల్ఫ్ డిక్లరేషన్ రైతుల విషయంకి వచ్చేసరికి ఎందుకన్న కెటిఅర్, ఈ రాష్ట్ర ప్రభుత్వం సెల్ప్ డిక్లకేరేషన్ రుద్దుతుందఅన్నారు. కేవలం ప్రస్తుతం ఉన్న ఏడున్నర వేల కోట్ల రూపాయల బడ్జెట్ దాటకుండా రైతు భరోసాను నామమాత్రంగా అమలు చేసే ప్రయత్నం చేస్తుందని కెటిఆర్ విమర్శించారు.

ఈ రాష్ట్ర ప్రభుత్వ సంవత్సర కాలంలో పాలించిన తీరుకు ప్రజల నుంచి తమ పార్టీ నుంచి ఇచ్చేది మైనస్ మార్కులు అని కెటిఆర్ అన్నారు. వీళ్లు నడుపుతున్నది ప్రభుత్వం కాదని, పరిహాసమని అన్నారు. పరిపాలన పేరుతో ప్రజలను క్రూరంగా హింసిస్తున్న తీరు తెలంగాణ సమాజం గమనిస్తుందన్నారు. తెలంగాణ ప్రజలు ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం బాగుందని చెప్తున్నారా. ఎవరిని అడిగినా, ఒక్కరైనా ఈ ముఖ్యమంత్రి గురించి మంచిగా మాట్లాడుతున్నారా. సమాజంలో ఏ ఒక్కరిని అడిగిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బండ బూతులు తిడుతున్నారన్నారు. ఉప ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని కోమటిరెడ్డి దాకా ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదించే పని పెట్టుకున్నారని ఆరోపించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి పై నిర్ణయం తీసుకోలేదని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ తరపున అభ్యర్థులను పెట్టే గతంలో ఉద్యమ సమయంలో మేమే కొత్త సంప్రదాయం తెచ్చామన్నారు. ప్రతిపక్ష పార్టీ పాత్ర తాము చాలా స్పష్టంగా నిర్వహిస్తున్నామని, ప్రభుత్వ అన్యాయాలను, అక్రమాలను ఎదిరిస్తున్నామన్నారు.ఈ సందర్భంగా బిఆర్‌ఎస్ పార్టీ రూపొందించిన క్యాలెండర్‌ను కెటిఆర్ ఆవిష్కరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News