- Advertisement -
కంచ గచ్చిబౌలి పర్యావరణ పరిరక్షణ కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల విజయం అని అభివర్ణించారు. విద్యార్థుల నిస్వార్థ నిరంతర స్ఫూర్తివంతమైన పోరాటం వల్లనే ఈ సానుకూల తీర్పు వచ్చిందని తెలిపారు. కంచ గచ్చిబౌలి భూముల పరిరక్షణ కోసం మద్దతు ఇచ్చిన పర్యావరణ ప్రేమికులు, సామాజిక కార్యకర్తలు, సెలబ్రిటీలు, మీడియా, సోషల్ మీడియా మిత్రులకు కెటిఆర్ విద్యార్థుల తరఫున ధన్యవాదాలు తెలిపారు.
- Advertisement -