Sunday, December 22, 2024

ఓవైపు సాగునీటి సంక్షోభం.. మరోవైపు రుణమాఫీ ద్రోహం:కెటిఆర్

- Advertisement -
- Advertisement -

వందలాది మంది రైతులు పిట్టల్లా రాలిపోతున్నా ఈ ప్రభుత్వంలో చలనం లేదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పొలం ఉన్న రైతులనూ పొట్టుబెట్టుకుంటున్నారని, కౌలు తీసుకున్న కర్షకులనూ కబళిస్తున్నారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే రోజు ముగ్గురు అన్నదాతలు బలికావడానికి ముమ్మాటికీ రైతు వ్యతిరేక రేవంత్ రెడ్డి సర్కారే కారణమని పేర్కొన్నారు. ఓవైపు సాగునీటి సంక్షోభం.. మరోవైపు రుణమాఫీ ద్రోహం.. ఇంకోవైపు రైతు భరోసా మోసం.. కౌలు రైతులకూ అందని సాయం అంటూ కెటిఆర్ ఎక్స్ వేదికగా విమర్శించారు.

రైతుకు రక్షణ వలయంగా ఉన్న పథకాలను ఒక్కొక్కటిగా ఎగ్గొట్టడంతోనే వ్యవసాయంలో ఈ విలయం నెలకొందని అన్నారు. వందలాది మంది రైతులు పిట్టల్లా రాలిపోతున్నా ఈ ప్రభుత్వంలో చలనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి సోయి లేదు..ప్రభుత్వానికి బాధ్యత లేదని ఎక్స వేదికగా ద్వజమెత్తారు. దసరా పండుగ వేళ.. వ్యవసాయాన్ని దండగలా మార్చిన సిఎం రేవంత్‌కు రైతన్నల చేతిలో దండన తప్పదని హెచ్చరించారు. అన్నదాతలారా ఆత్మస్థైర్యం కోల్పోకండి..! ముంచే రోజులు పోతాయ్..!! మళ్లీ మంచి రోజులొస్తాయ్’..!!! జై కిసాన్ అంటూ కెటిఆర్ వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News